20 కిలోమీటర్ల దూరంలో ఉండే శతృవుల్ని కాల్చి చంపే షూస్..ఇండియన్ ఆర్మీకోసం..యంగ్ సైంటిస్ట్ కృషి

20 కిలోమీటర్ల దూరంలో ఉండే శతృవుల్ని కాల్చి చంపే షూస్..ఇండియన్ ఆర్మీకోసం..యంగ్ సైంటిస్ట్ కృషి

UP : Fire Shoes For the Indian Army: తెలివితేటల్లోను..టాలెంట్ లోను భారత్ యువత గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. అవకాశాలు లేకపోయినా తమ ప్రతిభను కనబరుస్తున్నారు. కానీ యువత ప్రతిభల్ని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోవటం విచారించాల్సిన విషయం. ఎంతో అత్యద్భుతమైన సైంటిస్టులు భారత్ లో ఉన్నారని మరోసారి నిరూపించాడో యంగ్ సైంటిస్టు శ్యామ్ చౌరాసియా. ఉత్తరప్రదేశ్ లోని వారణాశికి చెందిన యంగ్ సైంటిస్టు శ్యామ్ చౌరాసియా ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేక షూస్ తయారుచేసి భారత యువత దేంట్లోను తీసిపోరని నిరూపించాడు.

శ్యామ్ చౌరాసియా తయారుచేసిన షూస్ సామాన్యమైనవి కాదు. సరిహద్దుల్లో శతృవుల్ని చీల్చి చెండాడే ‘స్పెషల్ షూస్’’అవి. శత్రు మూకలు ఇండియా సరిహద్దుల్లోకి ప్రవేసిస్తున్నారని తెలిస్తే చాలు…20 కిలోమీటర్ల ఇవతలి నుంచి ఆ షూష్ బుల్లెట్ల తుఫాను కురిపించగలవంటున్నాడు శ్యామ్ అశోక్. ఆ ‘స్పెషల్ షూష్’ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతీ భారతీయుడికి ఉంది. షూస్ ఏంటీ బుల్లెట్ల వర్షం కురిపించటమేంటో తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్…ప్రధాని మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి చెందిన యంగ్ సైంటిస్ట్ శ్యామ్ చౌరాసియా వారణాసిలోని ఓ సంస్థలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఛార్జి గా పనిచేస్తున్నాడు. శ్యామ్ తయారుచేసిన ఈ షూస్ కి రెండు మడతపెట్టిన 9mm గన్ బ్యారెల్స్ ఉంటాయి. ఈ షూ సౌండ్‌ ఆధారంగా శత్రువుల రాకను గుర్తిస్తాయి. అంతే క్షణాల్లో బుల్లెట్లు కురిపించి ఈ షూస్ ఒక్కొటక్కటి ఆరున్నర కేజీల బరువుంటుంది.

ఈ షూస్… రేడియో ఫ్రీక్వెన్సీలు, మొబైల్ నెట్‌వర్కుల ఆధారంగా పనిచేస్తాయి. ఒక్కో షూ దాదాపు 6న్నర కేజీల బరువు ఉంటాయి. రబ్బర్, స్టీల్ ప్లేట్లను మిక్స్ చేసి ఈ షూష్ ను తయారుచేశారు. ఈ స్పెషల్ షూష్ శతృవుల మీద బుల్లెట్ల వర్షం కురిపించడమే కాదు… సియాచిన్‌లో మైనస్ డిగ్రీల వాతావరణంలో వాటిని వేసుకున్న సైనికులకు చక్కటి వెచ్చదాన్నిస్తాయి. ఎందుకంటే ఈ షూలలో ప్రత్యేకమైన హీటర్ కూడా ఉంటుంది. అంతేకాదు..సోలార్ ఛార్జింగ్ సిస్టం, స్టీల్ షీట్, లెడ్ లైట్, సోలార్ ప్లేట్ రేడియో సర్క్యూట్, స్విచ్ అండ్ వైబ్రేషన్ మోటర్, ఎలక్ట్రానిక్ ట్రిగ్గర్ కూడా ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ షూస్ వేసుకుంటే శతవుల గుండెల్లో దడే.

యంగ్ సైంటిస్టు శ్యామ్ చౌరాసియా తాను రూపొందించిన ఈ ప్రత్యేక షూస్ గురించి మాట్లాడుతూ..ఈ ఫైర్ షూల లేజర్ సెన్సార్, హ్యూమన్ సెన్సార్ లను బోర్డర్ దగ్గర సెట్ చేయాలి. అప్పుడు శత్రువులు సరిహద్దులు దాటి వచ్చేందుకు యత్నిస్తే… వెంటనే షూలకు ఉండే సెన్సార్లు గుర్తిస్తాయి. ఆ వెంటనే సెన్సార్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేస్తుంది. వెంటనే సిగ్నల్స్ షూకి వెళ్లిపోతాయి. వెంటనే షూ… బీప్ బీప్ మంటూ శబ్దాలు చేస్తుంది. అంతేకాదు… వెంటనే షూ నుంచి బుల్లెట్స్ దూసుకెళ్తాయి. ఈ సమయంలో సైనికులు కూడా అలర్ట్ అయ్యి… శత్రుమూకల పని పట్టొచ్చని తెలిపారు.

సాధారణంగా సైనికులు తమ చేతిలోని ప్రత్యేక తుపాకులతో శతృవులపై కాల్పులు జరుపుతారు. ప్రత్యేక పరిస్థితుల్లో చేతుల్లో ఆయుధాలు లేనప్పుడు అచ్చంగా.. జేమ్స్ బాండ్ సినిమాల్లో లాగా… మన సైనికులు ఈ షూలతో కూడా కాల్పులు జరపవచ్చు అంటున్నాడు శ్యామ్.

Fire Shoes For the Indian Army (1)

ఈ షూల ప్రత్యేక ఇంతటితో నే కాదు ఈ షూలు ముందువైపునుంచే కాదు..వెనకవైపు నుంచి కూడా కాల్పులు జరిపే సామధ్యం వీటి సొంతం. ఈ ఫైర్ షూష్ గురించి వాటిలో ఉండే ప్రత్యేకత గురించి యంగ్ సైంటిస్ట్ శ్యామ్ చౌరాసియా కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రికి లేఖ రాయబోతున్నారు. తద్వారా ఈ షూలను ఆర్మీ ఆమోదిస్తే… ఇక ఉగ్రమూకలకు షాకుల మీద షాకులు తప్పవు. బుల్లెట్ల వర్షం కురవటం తప్పదు..దీంతో శతృమూకలు భారత్ సరిహద్దుల్లో అడుగు పెట్టాలంటే దడే నన్నమాట..