Bollywood Movies : సల్మాన్ దారిలోనే బాలీవుడ్ మూవీస్..!

Bollywood Movies : సల్మాన్ దారిలోనే బాలీవుడ్ మూవీస్..!

Bollywood Movies

Bollywood Movies: కరోనా సెకండ్ వేవ్ ధాటికి మళ్లీ వాయిదాల పర్వమే కొనసాగించారు చాలామంది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్. ఏదేమైనా మా సినిమా థియేటర్ రిలీజే అంటూ పట్టుబట్టారు. కానీ ‘రాధే’ తో సల్మాన్ ఖాన్ ట్రెండ్ మార్చాడు. టాక్ సంగతెలా ఉన్నా క్యాష్ రాబట్టాడు. దీంతో ఇప్పుడు సల్లూ భాయ్ ట్రాక్‌లోకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. మరి ‘రాధే’ బాటలోనే మరిన్ని క్రేజీ మూవీస్ మన ఇంటికే రానున్నాయా..?

RADHE

‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ‘రాధే’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా సల్మాన్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఎంతలా అంటే ఈ సినిమా చూసేందుకు 249 రూపాయలు పెట్టేందుకు కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో తొలి రోజు జీ ప్లెక్స్ సర్వర్లు క్రాష్అయ్యాయి. మే 13న విడుదలైన ‘రాధే’ మూవీను వీకెండ్ వరకు 9.9 మిలియన్స్ మంది ఆడియెన్స్ చూసినట్టు అంచనా. ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ఇంతటి హ్యూజ్ రెస్పాన్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేకర్స్. డిజిటల్ ఫ్లాట్ ఫాంపై ‘రాధే’ ట్రెండ్ చూసి మిగిలిన దర్శకనిర్మాతల్లో కొత్త ఆలోచన మొదలైంది.

Bollywood : బాబోయ్ సెకండ్ వేవ్.. బెంబేలెత్తుతున్న బాలీవుడ్..

‘రాధే’ ఇచ్చిన భరోసాతో డిజిటల్ బాట పట్టేందుకు క్యూ కడుతున్నారు స్టార్ హీరోలు. అక్షయ్ కుమార్‘సూర్యవంశీ’, రణ్‌వీర్‌సింగ్ ‘83’, అజయ్ దేవ్‌గణ్‘మైదాన్’, సల్మాన్ కీ రోల్ చేసిన ‘అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్’ లాంటి క్రేజీ సినిమాలన్నీ ‘పే పర్ వ్యూ’ దారిలో వెళ్లే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓటీటీ సంస్థలతో మేకర్స్ గట్టిగానే డిస్కషన్స్ చేస్తున్నట్టు బాలీవుడ్ టాక్. అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, కత్రినా కైఫ్ ‘సూర్యవంశీ’ నే తీసుకుందాం. పోలీస్ కథతో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి సంవత్సరం గడుస్తోంది. ఇంక వెయిట్ చేసే ఓపికలేదు నిర్మాతల్లో. అందుకే ఇప్పుడు డిజిటల్ వేదికలకు ఎస్ చెప్పేలా ఉన్నారు.

83

రణ్‌వీర్ సింగ్ నటించిన సినిమా ‘83’. ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రపంచ కప్ గెలుచుకున్న నేపథ్యంతో తెరకెక్కింది. అప్పటి టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ క్యారెక్టర్‌లో రణ్‌వీర్, ప్రత్యేక పాత్రలో దీపికా నటించిన ఈ మూవీ ఎప్పుడో పూర్తి అయింది. సల్మాన్ బావమరిది అంతిమ్ శర్మ హీరోగా నటిస్తూ, నిర్మించిన సినిమా ‘అంతిమ్’. సల్మాన్ ఖాన్ అతిథి క్యారెక్టర్ చేసిన ఈ మూవీ షూటింగ్ పూర్తయి కూడా సంవత్సరం గడుస్తోంది. అటు అజయ్ దేవగణ్ ‘మైదాన్’ సినిమాదీ అదే పరిస్థితి. అందుకే ఇంక ఎక్కువ టైం తీసుకుని.. థియేటర్స్ కోసం ఎదురుచూడకుండా.. డిజిటల్ వైపు అడుగేసేందుకు సై అంటున్నారు బాలీవుడ్ స్టార్స్..

Maidaan