Ugadi Wishes : తెలుగు సినిమాలు.. ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

గతేడాది అన్ని రంగాలలానే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది.. షూటింగ్స్, రిలీజులు, అప్ డేట్స్‌తో పరిశ్రమ కళకళలాడుతోంది. 2021 ప్లవ నామ సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త కబుర్లతో పలకరించారు మేకర్స్..

Ugadi Wishes : తెలుగు సినిమాలు.. ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

Ugadi Wishes

Ugadi Wishes: గతేడాది అన్ని రంగాలలానే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది.. షూటింగ్స్, రిలీజులు, అప్ డేట్స్‌తో పరిశ్రమ కళకళలాడుతోంది. 2021 ప్లవ నామ సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త కబుర్లతో పలకరించారు మేకర్స్..

Vakeel Saab

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ నుండి డార్లింగ్ లవ్లీ పోస్టర్ రిలీజ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఇరు హీరోల అభిమానులకు కిక్ ఇచ్చే న్యూ పోస్టర్ వదిలారు.

RRR

ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’, రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ నుండి డార్లింగ్ లవ్లీ పోస్టర్ రిలీజ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఇరు హీరోల అభిమానులకు కిక్ ఇచ్చే న్యూ పోస్టర్ వదిలారు.

Virata Parvam

విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’, వెంకీ-వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’, నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’, ‘ఆచార్య’ నుండి సిద్ధ ప్రేయసి నీలాంబరిగా పూజా హెగ్డే లుక్, నాగ చైతన్య- సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’, సత్యదేవ్ ‘తిమ్మరసు’, డా.మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’, గోపిచంద్-తమన్నాల ‘సీటీమార్’, అలీ, సీనియర్ నరేష్ నటిస్తున్న ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’, ఆది సాయికుమార్ ‘బ్లాక్’ సినిమాల పోస్టర్లతో పాటు బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోతున్న బిబి3 మూవీకి ‘అఖండ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ టైటిల్ రోర్ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్.

Narappa