ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారండోయ్!

ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారండోయ్!

Tollywood Movies: కొత్త సంవత్సరం ఫుల్ స్పీడ్ మీదున్నారు సినిమా వాళ్లు. ఇప్పటికే షూటింగ్స్ డిలే అవ్వడంతో ఇక అస్సలు ఆలస్యం చేసేది లేదంటూ.. ఫుల్ స్పీడ్‌లో షూటింగ్స్ చేసేస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన పెద్ద సినిమాలతో పాటు మొన్న మొన్న స్టార్ట్ చేసిన సినిమాలు కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి. మరి ఫినిషింగ్ టచెస్ చేసుకుంటున్న ఆ సినిమాలేంటో చూద్దామా..

‘ఆర్ఆర్ఆర్’
లాస్ట్ ఇయర్ రిలాక్స్ అయ్యింది చాలనుకుని.. ఈ సంవత్సరం ఒక్క రోజు కూడా వేస్ట్ చెయ్యదలచుకోవడం లేదు స్టార్లు. అందుకే సినిమాల్ని పోటీ పడి మరీ స్పీడప్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన చాలా సినిమాలు ఇప్పటికే ఫినిషింగ్ టచెస్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రెండేళ్లనాడు రాజమౌళి స్టార్ట్ చేసిన‘ ఆర్ఆర్ఆర్’ సినిమా లాస్ట్ స్టేజ్‌లో ఉంది. 90 పర్సెంట్ షూటింగ్ అయిపోయిన ఈ సినిమా ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుంటోంది.

RRR

‘రాధే శ్యామ్’
ట్రిపుల్ ఆర్ తో పాటు అంతే క్రేజ్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా కూడా లాస్ట్ స్టేజ్‌ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. రాధా కృష్ణ డైరెక్షన్లో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ రెట్రో లవ్ స్టోరీ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది.

Radhe Shyam

‘వకీల్ సాబ్’

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి సినిమాలు స్టార్ట్ చేశారు. కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించి ఫైటింగ్ సీన్స్‌తో షూటింగ్ కంప్లీట్ చేశారు పవర్‌స్టార్. ఇక మిగిలిన పార్ట్ షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ వేణు శ్రీరామ్ .

Vakeel Saab

‘టక్ జగదీష్’
వరుసగా సినిమాలు చేస్తున్న నేచురల్ స్టార్ నాని కూడా ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ ‘వి’ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసిన నాని ఈ ఇయర్ 3 సినిమాలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందుకే ‘టక్ జగదీష్’ ని చకచకా కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాని డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tuck Jagadish

అక్కినేని బ్రదర్స్
అక్కినేని అన్నదమ్ములు కూడా సినిమాల విషయంలో స్పీడ్ చూపిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ కి సంబంధించిన ప్యాచ్ వర్క్ జరుగుతోంది. తమ్ముడు అఖిల్ కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ స్టార్ట్ చేసి ఫైనల్ టచెస్ ఇచ్చే పనిలో ఉన్నారు.

Love Story

వెంకటేష్ – శర్వానంద్
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా వస్తున్న తమిళ్ రీమేక్ ‘నారప్ప’ కూడా క్లైమాక్స్ షూట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఈ బ్యాలెన్స్ షూట్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షనే అంటోంది టీమ్. శర్వానంద్ హీరోగా వస్తున్న ‘శ్రీకారం’ సినిమా కూడా ఫినిషింగ్ టచ్ ఇస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది.

Narappa

నితిన్, కార్తికేయ, బెల్లంబాబు
నితిన్, కీర్తిసురేష్ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘రంగ్ దే’ మూవీ ఈ మధ్యనే దుబాయ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది. కార్తికేయ హీరోగా వస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా కూడా మెయిన్ యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకుని లాస్ట్ స్టేజ్‌కి వచ్చింది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా కూడా ప్యాచ్ వర్క్‌తో ఫినిషింగ్ టచ్ ఇస్తోంది. జనవరి 15 న ఆడియన్స్ ముందుకొస్తున్నాడు ‘అల్లుడు అదుర్స్’.

Alludu Adhurs