2021లో వాట్సాప్ రాబోయే కొత్త ఫీచర్లు: ఇంట్రస్టింగ్‌గా.. ఇరిటేట్ కాకుండా!

2021లో వాట్సాప్ రాబోయే కొత్త ఫీచర్లు: ఇంట్రస్టింగ్‌గా.. ఇరిటేట్ కాకుండా!

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తోన్న వాట్సాప్ యాప్.. ఫేస్బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫాం.. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రతినెలా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ నకిలీ సమాచారం వ్యాప్తిని ఎదుర్కోవటానికి అనేక లక్షణాలను ప్రారంభించింది. గ్రూప్ కాల్స్ కూడా అందుబాటులోకి తీసుకుని రాగా.. పాల్గొన్నవారు జూమ్, స్కైప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ఇతర వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సరిపోలుస్తున్నారు.

ఈ సంవత్సరం కూడా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్.. కొన్ని కొత్త ఫీచర్లను పరీక్షిస్తోంది. రాబోయే రోజుల్లో వాటిని విడుదల చేయాలని యోచిస్తోంది. మొత్తం యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే ఐదు రాబోయే వాట్సాప్ ఫీచర్లను పరిశీలిస్తే..

వాట్సాప్ లాగ్అవుట్ ఫీచర్:
వాట్సాప్ లాగ్అవుట్ ఫీచర్‌ను అతి త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. సంస్థ ఇప్పటికే దీనిని పరీక్షించడం ప్రారంభించగా.. వాట్సప్ బీటా ఇన్ఫో(WABetaInfo) నుంచి వస్తున్న నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ ద్వారా ప్రాథమికంగా వాట్సాప్ యూజర్లు తమ ఫోన్ అవసరం లేకుండా డెస్క్‌టాప్ లేదా వెబ్‌లోని వారి ఖాతాకు లాగిన్ అవ్వడానికి అనుమతి ఇస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఫోన్ లేకపోయినా సరే డెస్క్‌టాప్‌లో వాట్సప్‌కు కనెక్ట్ అవ్వవచ్చు.. లాగ్ అవుట్ అవ్వొచ్చు.

వాట్సాప్ మల్టీ-డివైస్ ఫీచర్:
ఈ వాట్సాప్ ఫీచర్ కోసం చాలా కాలంగా ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్నారు.. మెసేజింగ్ ప్లాట్‌ఫాం బీటాలో ఈ లక్షణాన్ని పరీక్షిస్తున్నట్లు తెలిస్తోంది. ఇది అతి త్వరలో విడుదల కావచ్చని చెబుతున్నారు. ఈ ఫీచర్‌తో వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ పరికరాల్లో వారి వాట్సప్ ఖాతాకు లాగిన్ అవ్వగలరు. ప్రస్తుతం, వినియోగదారులు ఒక్క మొబైల్‌లో మాత్రమే తమ వాట్సాప్ ఖాతాకు లాగిన్ అయ్యే అవకాశం ఉంది.

వాట్సాప్ వెబ్‌లో వాయిస్ మరియు వీడియో కాల్స్:
వాట్సప్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో లక్షణం వాయిస్.. మరియూ వీడియో కాల్స్.. వాస్తవానికి, వీడియో కాలింగ్ ఒకరినొకరు కలుసుకునే ఏకైక మార్గంగా మారినప్పుడు ప్లాట్‌ఫాం గతేడాది ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. వెబ్ ఫీచర్ కోసం వాట్సాప్ వీడియో మరియు వాయిస్ కాల్‌లను పరీక్షిస్తోంది. వాట్సప్ త్వరలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని రానుంది.

వాట్సాప్ మ్యూట్ వీడియోలు:
వాట్సాప్ ప్రస్తుతం పరీక్షిస్తున్న మరో లక్షణం మ్యూట్ వీడియోలు. ఈ ఫీచర్ వినియోగదారులకు వీడియోను పంపే ముందు మ్యూట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఊహించిన దానికంటే త్వరగా విడుదల కాగలదని నివేదికలు సూచిస్తున్నాయి.

రీడ్ లేటర్.. వాట్సాప్ ఫీచర్:
మీ వాట్సాప్‌లో మీరు ఓ కాంటాక్ట్‌/ గ్రూపు నోటిఫికేషన్లు ఒకసారి వద్దని అనుకుంటే.. ‘రీడ్‌ లేటర్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని వల్ల యూజర్లకు కాస్త ఇర్రిటేషన్ తగ్గుతుందని భావిస్తున్నారు. ఏదైనా కాంటాక్ట్‌/గ్రూప్‌ ఛాట్‌ మీ లిస్ట్‌లో కనిపించొద్దు అనుకుంటే దానిపై లాంగ్‌ ప్రెస్‌ చేసి పైన టాప్‌లో ఉండే మూడు చుక్కల మెనూ క్లిక్‌ చేస్తే ‘రీడ్‌ లేటర్‌’ అని ఉంటుంది. దానికి క్లిక్‌ చేస్తే మీ చాట్ లిస్ట్‌ ఆఖరులో ‘రీడ్‌ లేటర్‌’ అనే ఆప్షన్‌లోకి అవి చేరుతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఆ ట్యాబ్‌లోకి వెళ్లి చాట్స్ చదువుకోవచ్చు. రీడ్‌ లేటర్‌లో ఉన్న ఛాట్స్‌ నోటిఫికేషన్లు రావు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా కొంతమందికి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అందరూ వాడొచ్చు.

పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్:
వాట్సాప్ తన ఐఓఎస్ వినియోగదారుల కోసం పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ ఫీచర్ ని వచ్చే ఏడాదిలో తీసుకురాబోతుంది. ఈ ఫీచర్‌లో భాగంగా మల్టీపుల్ ఫోటోలను, వీడియోలను కాపీ చేసి చాట్‌లో పేస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం మల్టీపుల్ ఐటమ్స్‌ని ఎంచుకొని ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి టాప్‌ చేసి తర్వాత ‘కాపీ’ చేయాలి. తర్వాత ఆ ఐటమ్స్‌ని మీకు నచ్చిన వారికి ఒకేసారి పంపించవచ్చు.