మెగా మేనల్లుడి ప్రభంజనం..

మెగా మేనల్లుడి ప్రభంజనం..

Uppena 1 Week Grosse: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కన్నడ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఉప్పెన’.. ఫిబ్రవరి 12న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఉప్పెన క్రియేట్ చెస్తోంది.

Uppena

రెండో వారంలోనూ స్టడీ కలెక్షన్లతో, రిపీట్ ఆడియెన్స్‌తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. తెలుగులో ఏ డెబ్యూ హీరోకి సాధ్యం కాని రేర్ రికార్డ్
సృష్టించాడు వైష్ణవ్. మొదటి వారం రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది ‘ఉప్పెన’. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బెంచ్ మార్క్ సెట్ చేసి, మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో అనే నిజాన్ని నిరూపించింది..

ఫస్ట్ డే ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 10.42 కోట్ల భారీ షేర్ రాబట్టింది. ఒక డెబ్యూ హీరో సినిమాకి ఇంత పెద్ద మొత్తంలో షేర్ రావడం అంటే చిన్న విషయం కాదని ట్రేడ్ వర్గాల వారు సైతం షాక్ అయ్యారు. కట్ చేస్తే ఇదే ఫ్లో వారం మొత్తం కంటిన్యూ అయింది. మరికొద్ది రోజులు ఇదే హవా కొనసాగిస్తే కనుక సుకుమార్ చెప్పినట్టు ‘ఉప్పెన’ రూ.100 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Uppena