ఆశి, బేబమ్మ, బుచ్చిబాబులకు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన మైత్రీ నిర్మాతలు..

ఆశి, బేబమ్మ, బుచ్చిబాబులకు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన మైత్రీ నిర్మాతలు..

Producers Surprised: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ.. ‘ఉప్పెన’..

uppena

మూడో వారంలోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతూ.. ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుందీ చిత్రం.. తాజాగా హీరో హీరోయిన్లు, దర్శకుడికి నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని సర్‌ప్రైజ్ చేశారు. తొలిచిత్రంతోనే ఆశి, బేబమ్మలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న వైష్ణవ్‌కి రూ. 1 కోటి, కృతికి రూ. 25 లక్షలు మర్యాదపూర్వకంగా అందించారు.

Uppena

దర్శకుడు బుచ్చిబాబుకి ఫ్లాట్ లేదా మంచి కార్ ఇద్దామనుకోగా తను కార్ అడగ్గా బ్యూటిఫుల్ పోష్ కార్ ఇచ్చి వారిని మరోసారి ఆనందంలో ముంచెత్తారు.. కాగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్టు ‘ఉప్పెన’ త్వరలో రూ. 100 కోట్ల మార్క్‌ని టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

Uppena