HIT 2: ‘ఉరికే ఉరికే’ అంటూ రొమాంటిక్ పాట పాడుతోన్న అడివి శేష్

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్ మూవీ ‘హిట్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి ‘ఉరికే ఉరికే’ అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడిచింది.

HIT 2: ‘ఉరికే ఉరికే’ అంటూ రొమాంటిక్ పాట పాడుతోన్న అడివి శేష్

HIT 2: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్ మూవీ ‘హిట్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Hit 2 Teaser : హిట్ సెకండ్ కేస్ టీజర్ రిలీజ్.. అడివిశేష్ మేనియా.. నాని, శేష్‌కి ఇంకో హిట్ రెడీ..

ఇక ఇటీవల ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. తొలి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, రెండో పార్ట్‌లో యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాడని ఈ చిత్ర టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ మరో అదిరిపోయే అప్డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమా నుంచి ‘ఉరికే ఉరికే’ అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడిచింది.

HIT 2 Teaser: టీజర్ డేట్ అనౌన్స్ చేసిన ‘హిట్-2’ డైరెక్టర్.. హాలీవుడ్ స్థాయిలో హిట్ వర్స్!

ఈ రొమాంటిక్ వీడియో సాంగ్‌ను నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు హిట్-2 మేకర్స్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఎంఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.