కరోనా వ్యాక్సిన్ రీసెర్చ్ హ్యాక్ చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది.. అమెరికా ఆరోపణ

  • Published By: srihari ,Published On : May 14, 2020 / 05:22 AM IST
కరోనా వ్యాక్సిన్ రీసెర్చ్ హ్యాక్ చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది.. అమెరికా ఆరోపణ

కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని మొదటినుంచి అమెరికా గట్టిగా వాదిస్తోంది. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందంటూ అగ్రరాజ్యం ఆరోపణలు చేస్తూనే ఉంది. చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రపంచానికి ఈ దుస్థితి రావడానికి చైనానే కారణమంటూ మండిపడుతున్నారు. చైనా అంటించిన కరోనాను నిర్మూలించడానికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే దిశగా ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. అమెరికా కూడా కరోనా వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా పరిశోధనలు చేస్తోంది. 

కరోనా వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించి సమాచారాన్ని హ్యాక్ చేసేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎఫ్‌బీఐ, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం.. చైనీస్ హ్యాకర్లు.. యూఎస్ రీసెర్చర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఎటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హెచ్చరించింది. కొవిడ్-19 వైరస్ వ్యాక్సిన్ సమాచారాన్ని తస్కరించేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఏజెన్సీ వెల్లడించింది. అంతేకాదు.. కరోనా వైరస్ వ్యాప్తికి గల కారణాలపై చేస్తున్న పరీక్షలకు సంబంధించి సమాచారంతో పాటు ట్రీట్ మెంట్స్ వంటి డేటాను చైనా హ్యాకర్లు తస్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. 
wuhan
 
విలువైన intellectual property (IP), టీకాలు, చికిత్సలు, నెట్‌వర్క్‌ల నుంచి పరీక్షలు COVID-19 సంబంధిత పరిశోధనలతో అనుబంధంగా ఉన్న వ్యక్తుల నుంచి పరీక్షించడానికి సంబంధించిన ప్రజారోగ్య డేటాను చట్టవిరుద్ధంగా పొందటానికి ప్రయత్నిస్తున్నట్లు గమనించామని జాయింట్ వార్నింగ్ ఏజెన్సీ తెలిపింది. రాబోయే రోజుల్లో చైనా హ్యాకింగ్ ప్రయత్నాల గురించి మరిన్ని సాంకేతిక వివరాలను విడుదల చేయనున్నట్లు ఏజెన్సీలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. 

ప్రజల్లో కరోనా భయాన్ని అవకాశం చేసుకుని సైబర్ క్రిమినల్స్ కొవిడ్-19 సమయంలో సైబర్ దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని FBI హెచ్చరించింది. ఏప్రిల్ నెలలో కరోనా వైరస్ కు సంబంధించి 3,600కు పైగా ఫిర్యాదులు అందినట్టు ఎఫ్‌బీఐ తెలిపింది. కరోనా సంక్షోభ సమయంలో ఆన్ లైన్ స్కాములతో అమెరికన్ల నుంచి 12 మిలియన్ డాలర్లకు పైగా సైబర్ నేరగాళ్లు తస్కరించారు. ఇతర దేశాల్లోని విలువైన సమాచారాన్ని తస్కరించేందుకు చైనా ప్రభుత్వం హ్యాకర్ల వెనక ఉండి వారితో సైబర్ దాడులు చేయొస్తోందని సెక్యూరిటీ రీసెర్చర్లు గుర్తించారు. COVID-19 వ్యాప్తిని ఎలా హ్యాడిల్ చేస్తున్నారనే సమాచారం కోసం వియత్నాం నుండి హ్యాకర్లు చైనా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ FireEye తెలిపింది. 

కరోనా వైరస్ డ్రగ్  remdesivir తయారీ వెనుక Gilead Sciences కంపెనీ లక్ష్యంగా ఇరాన్‌తో సంబంధం ఉన్న హ్యాకర్లు సైబర్ దాడికి ప్రయత్నిస్తున్నారంటూ రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఏప్రిల్ నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైబర్ దాడులు ఐదు వంతులు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. హెల్త్ కేర్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని చైనా ప్రభుత్వానికి మద్దతుగా హ్యాకర్లు దాడులకు పాల్పడే అవకాశం ఉందని CISAలో ఒక భాగమైన US Department of Homeland Security, United Kingdom’s National Cyber Security Centre కలిసి సంయుక్తంగా మే5న హెచ్చరించాయి. 

హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న సంస్థల్లో ఫార్మాసూటికల్ కంపెనీలు, కొవిడ్-19 వ్యాక్సిన్ సంబంధిత రీసెర్చర్లు ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. గతంలోనూ ఇతర సైబర్ దాడులకు కూడా చైనా హ్యాకర్లే కారణమని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. మహమ్మారి నుంచి ప్రపంచాలు ఆర్థికంగా కోలుకోవడానికి కరోనా వ్యాక్సిన్ అనేది ఒక కీలకమైదిగా రీసెర్చర్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ లేకుంటే ఈ వ్యాధి బారినపడి వందలు వేలల్లో మరణాలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసే సంస్థలే లక్ష్యంగా చైనా కుయుక్తులు పన్నుతోందని CISA, FBI పేర్కొన్నాయి. 

Read More:

HIV లాగా కరోనా వైరస్ ఎప్పటికీ పోదు, బాంబు పేల్చిన WHO

బాబోయ్: వాడి చెత్తలో పడేసిన మాస్క్ లనే మళ్లీ అమ్మేస్తున్నారు