Woman leg removed : కాళ్ల అందం కోసం ట్రీట్ మెంట్..కాలు కోల్పోయి 13 కోట్లు రాబట్టింది

ఓమహిళ కాళ్ల అందం కోసం చేయించుకున్న ట్రీట్మెంట్ వల్ల ఆమె కాలునే కోల్పోయింది. వైద్య ఖర్చుల కోసం ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. దీంతోఆమె ఆబ్యూటీసెలూన్ నుంచిరూ.13 కోట్లు పరిహారం పొందింది

Woman leg removed : కాళ్ల అందం కోసం ట్రీట్ మెంట్..కాలు కోల్పోయి 13 కోట్లు రాబట్టింది

Woman Whose Leg Pedicure Gets Rs 13 Crore In Damages

Woman whose leg pedicure gets Rs 13 crore in damages : అందం కోసం బ్యూటీపార్లర్ కు వెళ్లిన ఓ మహిళ తన కాలునే కోల్పోయింది.కాళ్లు అందంగా కనిపించటానికి పెడిక్యూర్ చేయించుకుంది. అదికాస్తా వికటించి ఆమె కాలునే కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సదరు బాధితురాలు ఆమె పెడిక్యూర్ చేయించుకున్న బ్యూటీపార్లర్ పై కేసు వేసి భారీ నష్టపరిహారం పొందింది. ఫ్లోరిడాకు చెందిన క్లారా షెల్ మాన్ అనే మహిళ 2018లో టంపాలోని టామీస్ నెయిల్స్ అనే పార్లర్‌కి వెళ్లింది. పాదాలకు పెడిక్యూర్‌ చేయించుకుంది. పాదాలకు పగుళ్లు ఉన్నాయని..పెడిక్యూర్ చేయించుకుంటే పాదాలు అందంగా కనిపిస్తాయని చెప్పారు పార్లర్ సిబ్బంది. సరే నంది క్లారా.

పాదాలు మంచి అందంగా ఉండటానికి పెడిక్యూర్ లో భాగంగా పార్లర్ ఉద్యోగి కాస్మటిక్‌​ ట్రీట్‌మెంట్‌ చేసింది. ఈ ట్రీట్ మెంట్ సమయంలో పొరపాటున క్లారా కాలు కాస్త తెగింది. అప్పుడు అది చిన్న గాటే అయినా అదే క్లారా జీవితంలో మర్చిపోలేని విషాద ఘటనగా మారింది. ఆ గాయం ఆమె జీవితాన్నే విషాదంగా మార్చేసింది. ఫెరిఫెరల్‌ వాస్క్యూలర్‌ అనే వ్యాధి (రక్తనాళాల్లో కొలస్ట్రాల్‌ ఏర్పడి ద్వారాలు ఇరుకై బ్లడ్ సర్క్యులేషన్ కు ప్రాబ్లమ్ గా ఏర్పడుతుంది) ఉండటంతో ఆ గాయం మానదు.

దీంతో ఆ చిన్న గాయం కాస్తా మానలేదు సరికదా.. ఇన్ఫెక్షన్‌కి గురైంది. అదికాస్తా ఆమె కాలు తీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో క్లారాకు వైద్య ఖర్చులు భారీగా అయ్యాయి. ఎంత ఖర్చు అయ్యాయంటే ఏకంగా ఆమె ఇంటినే అమ్మేసుకోవాల్సి వచ్చింది. క్లారా తన పాదాల సౌందర్యం కోసం చేయించుకున్న పెడిక్యూర్‌ తన జీవితాన్ని అత్యంద దయనీయ స్థితిలోకి నెట్టేసింది. దీంతో క్లారా కోర్టులో కేసు వేసింది. తనకు గాయం కావటానికి కారణం..తన ఈ దుస్థితికి కారణం అయిన సదరు బ్యూటీ పార్లర్ తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

ఈ క్రమంలో టామీస్ నెయిల్స్ పార్లర్‌ క్లారాతో సెటిల్ మెంట్ కుదుర్చుకుంది. తమది తప్పేనని ఒప్పుకుంది నష్టపరిహారం ఇస్తామని తెలిపింది. దీనికి సంబంధించి కోర్టులో డిసెంబర్ 16న సెటిల్ మెంట్ పేపర్స్ సబ్మిట్ చేసింది. ఆ టామీస్ నెయిల్స్ పార్లర్‌ క్లారాకు 1.75 million డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ 13 కోట్ల నష్టపరిహారాన్ని కూడా చెల్లించింది.