Joe Biden : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరుకానున్న జో బైడెన్

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

Joe Biden : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరుకానున్న జో బైడెన్

Joe Biden announces to attend funeral of Queen Elizabeth II

Joe Biden announces to attend funeral of Queen Elizabeth :  బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.రాజకుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ ప్రక్రియ ఉంటుంది. ఈక్రమంలో ఆమె అంత్యక్రియలకు తాను వెళుతున్నాను అంటూ జో బైడెన్ వెల్లడించారు. మరోవైపు రాణి అంత్యక్రియలకు హాజరవుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

క్వీన్ అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం తనకు తెలియదని… ఈ నెల 19న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ… అంత్యక్రియలకు మాత్రం తప్పకుండా హాజరవుతానని తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ కుమారుడు కింగ్ చార్లెస్ 3 కూడా తనకు బాగా పరిచయం అని వెల్లడించారు. కానీ ప్రస్తుత విషాదకర పరిస్థితుల్లో ఆయనకు ఫోన్ చేయలేదని తెలిపారు.

రాణి ఎలిజబెత్‌-II కన్నుమూయడంతో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. నిన్న రాత్రి నుంచే బకింగ్‌హామ్ ప్యాలెస్ కు ప్రజల తాకిడి మొదలైంది. ఇది కొనసాగుతునే ఉంది. బకింగ్‌హామ్ ప్యాలెస్ కు వెళ్ళే మార్గాలన్నీ ప్రజలతో నిండిపోయాయి. సంప్రదాయం ప్రకారం లండన్ లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌ గేట్ల వద్ద వద్ద పుష్పాలు ఉంచి రాణి ఎలిజబెత్‌-IIకు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. దీంతో ఎలిజబెత్‌-II కుమారుడు ఛార్లెస్ తన భార్య కెమిల్లాతో కలిసి బకింగ్‌హామ్ ప్యాలెస్‌ బయటకు కారులో వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.