H1B వీసాలపై నిషేధాన్ని మార్చి31 వరకు పొడిగించిన ట్రంప్

H1B వీసాలపై నిషేధాన్ని మార్చి31 వరకు పొడిగించిన ట్రంప్

US President Trump Extends  H1B Visa Ban : వ‌ల‌స కార్మికుల‌పై ఉన్న నిషేధాన్ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ పొడిగించారు. అమెరికాలో వ‌ర్క్ వీసాల‌పై ఉన్న తాత్కాలికంగా అమలవుతున్న నిషేధాన్ని మార్చి 31 వ‌ర‌కు పొడిగిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. పదవి లోంచి దిగే ముందు ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో ఈ నిషేధాల పొడిగింపు కూడా చోటు చేసుకుంది.

దేశంలోకి వచ్చి ఇతర దేశాలనుంచి వలస కార్మికులను అడ్డుకునేందుకు ట్రంప్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే జ‌న‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ట్రంప్ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతారు. ఆ త‌ర్వాత ఆ దేశ నూత‌న అధ్య‌క్షుడిగా బైడెన్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. ట్రంప్ అధికారం చేజిక్కించుకున్న తొలి రోజు నుంచే వ‌లస కార్మికుల‌పై ఆంక్ష‌లు అమ‌లు చేశారు. ముస్లిం దేశాల నుంచి వ‌స్తున్న వారిపై ఆయ‌న ట్రావెల్ బ్యాన్ విధించారు. వైట్‌హౌజ్‌లో చివ‌రి రోజులు గ‌డిపే వ‌ర‌కు కూడా ట్రంప్ ఆ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తూ వ‌చ్చారు. ట్రంప్ చేపట్టిని ఇమ్మిగ్రేషన్ చట్టాలపై విమర్శలు చేసిన నూతన అధ్యక్షుడు బైడెన్… వీసా పరిమితులపై స్పృష్టమైన ప్రకటన చేయలేదు.

గ‌త ఏడాది ఏప్రిల్‌, జూన్ నెల‌ల్లో ఇమ్మిగ్రాంట్ల‌పై నిషేధం విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఆ ఆదేశాలు అమ‌లులో ఉన్నాయి. గతేడాది చివరి రోజున ట్రంప్ …. దాన్ని ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు పొడిగించారు. వ‌ల‌స కార్మికుల‌పై బ్యాన్ వ‌ల్ల‌.. గ్రీన్ కార్డు ద‌ర‌ఖాస్తుదారుల్ని ఆపేస్తారు. తాత్కాలిక విదేశీ వ‌ర్క‌ర్ల‌ను కూడా దేశంలోకి ఎంట్రీ కానివ్వ‌రు. కాగా… అమెరికా లోకి కొత్తగా రావాలనకునేవారు తప్పని సరిగా ఆరోగ్య భీమా కలిగి ఉండాలని ట్రంప్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సమర్ధించింది.

క‌రోనా మ‌హ‌మ్మారితో దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స్థిరీక‌రించేందుకు ఇమ్మిగ్రేష‌న్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు గ‌తంలో ట్రంప్ తెలిపారు. నిషేధానికి గురైన‌వారిలో హెచ్‌1-బీ వీసాదారులు, వ‌ర్క్ వీసాదారులు, గ్రీన్ కార్డు హోల్డ‌ర్లు ఉన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల పలుకుటుంబాల వారు వేరు చేయబడ్డారు. చాలా మంది కన్న కలలు కల్లలు అయ్యాయని జస్టిస్ యాక్షన్ సెంటర్ వ్యవస్థాపకుడు మరియు వీసా పరిమితులపై పోరాటం చేస్తున్న న్యాయవాది కరెన్ తుమ్లిన్ అన్నారు.