Dosa as Naked Crepe: ఇడ్లీ కాదు.. డంక్‌డ్ రైస్ కేక్ డిలైట్.. మన వంటలకు అమెరికాలో కొత్త పేర్లు

అమెరికాలో మన వంటల పేర్లు మార్చేస్తున్నారు. అక్కడి రెస్టారెంట్లలో ఇండియన్ ఐటమ్స్‌కు కొత్త పేర్లు పెడుతున్నారు. వాళ్లకు తోచిన పేర్లు పెడుతూ, మనకిష్టమైన వంటల పేర్లు మార్చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఇష్టంగా తినే ఇడ్లీ, వడ, దోశ పేర్లు మార్చేశారు.

Dosa as Naked Crepe: ఇడ్లీ కాదు.. డంక్‌డ్ రైస్ కేక్ డిలైట్.. మన వంటలకు అమెరికాలో కొత్త పేర్లు

Dosa As Naked Crepe

Dosa as Naked Crepe: ఊరు మారినంత మాత్రాన పేర్లు మారవు కదా! అలాగే వంటల పేర్లు కూడా మారవు. కానీ, అమెరికాలో మాత్రం మన వంటల పేర్లు మార్చేస్తున్నారు. అక్కడి రెస్టారెంట్లలో ఇండియన్ ఐటమ్స్‌కు కొత్త పేర్లు పెడుతున్నారు. వాళ్లకు తోచిన పేర్లు పెడుతూ, మనకిష్టమైన వంటల పేర్లు మార్చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఇష్టంగా తినే ఇడ్లీ, వడ, దోశ పేర్లు మార్చేశారు.

Presidential Elections: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. 21న ఫలితాలు

అమెరికన్ టచ్ ఇస్తూ వాటికి ఇంగ్లీష్ పేర్లు పెట్టేశారు. ఒక రెస్టారెంట్ ఇలా కొత్త పేర్లు పెట్టింది. దీంతో ఈ అంశంపై ఇప్పుడు అక్కడి సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కొందరు ఇండియన్స్ దీనికి సంబంధించిన ఇమేజెస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ రెస్టారెంట్ మన దోశకు ‘నేక్‌డ్ క్రేప్’ అనే పేరు పెట్టింది. సాంబార్-ఇడ్లీకి ‘డంక్‌డ్ రైస్ కేక్ డిలైట్’ అని, వడకు ‘డంక్‌డ్ డోనట్ డిలైట్’ అని పేర్లు పెట్టింది. ఇవే పేర్లతో ఐటమ్స్ సప్లై చేస్తోంది. అంతే కాదు.. వీటి ధరలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఒక్కో ఐటమ్ ధర మన కరెన్సీలో దాదాపు రూ.1,400-1,500 వరకు ఉంది. అయితే, ఇలా మన ఫుడ్ ఐటమ్స్ పేర్లు మార్చేయడంపై చాలా మంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. వాటి పేర్లను ఇంగ్లీష్‌లోకి మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

Rahul Gandhi: ఉద్యోగాలు లేవు కానీ ట్యాక్సులు మాత్రం ఎక్కువ.. కేంద్రంపై రాహుల్ విమర్శలు

ఇటాలియన్ పిజ్జా, మెక్సికన్ టాకోస్, జపనీస్ సూషీ వంటి ఐటమ్స్‌ను అవే పేర్లతో పిలుస్తున్నప్పుడు ఇండియన్ ఐటమ్స్ పేర్లు మార్చడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఏ దేశానికి, ప్రాంతానికి వెళ్లినా ఫుడ్ ఐటమ్స్ పేర్లలో మార్పులు ఉండవని గుర్తు చేస్తున్నారు. ఇక వీటి ధరలు ఎక్కువగా ఉండటంపై కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు.