UN human rights: ఐరాస మానవ హ‌క్కుల బృందం చైనాలో స్వేచ్ఛ‌గా ప‌ర్య‌టించలేదు: అమెరికా

ఐక్య‌రాజ్య స‌మితి మానవ హ‌క్కుల మండ‌లి హైక‌మిష‌న‌ర్ మిషెల్ బాచెలెత్ బృందం చైనాలో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో ఆ దేశం వ్యవ‌హ‌రించిన తీరుపై అమెరికా విమ‌ర్శ‌లు గుప్పించింది.

UN human rights: ఐరాస మానవ హ‌క్కుల బృందం చైనాలో స్వేచ్ఛ‌గా ప‌ర్య‌టించలేదు: అమెరికా

Un

UN human rights: ఐక్య‌రాజ్య స‌మితి మానవ హ‌క్కుల మండ‌లి హైక‌మిష‌న‌ర్ మిషెల్ బాచెలెత్ బృందం చైనాలో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో ఆ దేశం వ్యవ‌హ‌రించిన తీరుపై అమెరికా విమ‌ర్శ‌లు గుప్పించింది. చైనాలో మిషెల్ బాచెలెత్ స్వేచ్ఛ‌గా ప‌ర్య‌టించేందుకు ఆ దేశ అధికారులు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం పట్ల తాము ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Drone: భార‌త్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద డ్రోన్ క‌ల‌కలం

మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోన్న‌ షింజియాంగ్‌తో పాటు చైనాలోని ప‌లు ప్రాంతాల్లో ప‌రిస్థితుల‌ను తెలుసుకునే వీలు లేకుండా మిషెల్ బాచెలెత్ ప‌ర్య‌ట‌న‌లో ప‌రిమితులు విధిస్తున్నార‌ని ఆరోపించింది. చైనాలోని ప‌రిస్థితుల‌పై కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు పేర్కొంది. షింజియాంగ్ ప్ర‌జ‌లు మిషెల్ బాచెలెత్ బృందానికి ఫిర్యాదులు చేయ‌కుండా చైనా అధికారులు హెచ్చ‌రించార‌ని త‌మ‌కు స‌మాచారం అందింద‌ని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే, షింజియాంగ్‌లోని ప‌రిస్థితుల‌పై బ‌హిరంగంగా మాట్లాడ‌వ‌ద్ద‌ని ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అధికారులు చెప్పార‌ని ఆరోపించింది.

pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్ల‌ల‌కు అస్వస్థత

కాగా, చైనాకు మిషెల్ బాచెలెత్ బృందం ఆరు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లింది. శ‌నివారంతో ఆ ప‌ర్య‌ట‌న ముగిసింది. ఈ నేప‌థ్యంలో చైనాలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న అంశంపై జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆ దేశ ప్రభుత్వానికి స్పష్టం చేసి చెప్పడంలో మిషెల్ బాచెలెత్ విఫలమయ్యారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె స్పందిస్తూ.. ఈ ప‌ర్య‌ట‌న‌ చైనాలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌నపై విచార‌ణ జ‌రిపేందుకు కాద‌ని అన్నారు. అయితే, దేశంలో అనుసరిస్తోన్న విధానాలపై చైనా ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పారు.