By mistake : బై మిస్టేక్..వేరే వారి బిడ్డకు జన్మనిచ్చింది..! ఆమె బిడ్డ ఏ తల్లి కడుపులో ఉందో..!!

బిడ్డలు కావాలని తపించిపోయిన ఓ మహిళ ఎట్టకేలకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీతాను వేరే వారి బిడ్డకు జన్మనిచ్చానని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. నాబిడ్డ నాక్కావాలని కోర్టుమెట్లెక్కింది.

By mistake : బై మిస్టేక్..వేరే వారి బిడ్డకు జన్మనిచ్చింది..! ఆమె బిడ్డ ఏ తల్లి కడుపులో ఉందో..!!

Us Two Couples Swap Babies After Ivf Mix Up

US : Two couples swap babies after IVF mix-up ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఒకరికి పుట్టిన శిశువులు మరొకరికి మారిపోయారని..సిబ్బంది నిర్లక్ష్యం అనే వార్తలు వింటున్నాం. సినిమాల్లోకూడా చూశాం. మరి ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులే కాదు..పుట్టకుండా అమ్మ కడుపులో శిశువుగా రూపుదిద్దుకునే ‘పిండాలు’ కూడా మారిపోతాయా? అదేంటీ కడుపులో పిండాలు ఎలా మారిపోతాయ్? అనే డౌటనుమానం వచ్చి తీరుతుంది. కానీ ఇది నిజంగా నిజమే జరిగింది కూడా. దానికి ఫలితంగా ఓ తల్లి పొరపాటున మరొకరి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది?..! ఏంటేంటీ?..పొరపాటున మరొరకరి బిడ్డకు జన్మనిచ్చిందా?ఏంటీ గందరగోళం అంటారా?అయితే తెలుసుకోవాల్సిందే..అసలు విషయం ఏమిటంటే..అదంతా డాక్టర్లు చేసిన నిర్వాకం ఫలితంగా జరిగింది. ఏమా డాక్టర్? ఏమా కథ అంటే..పిల్లలు పుట్టే అవకాశం లేని వారికి వరంగా మారింది కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్‌). కానీ ఇప్పుడిది వ్యాపారంగా మారింది. అది వేరే సంగతి. కానీ ఈ పిండాల మార్పేంటో తెలుసుకుందాం..

Read more : Breast Feeding : తల్లిపాలను పెంచే సహజమార్గాలు ఇవే…

అమెరికాకు చెందిన డఫ్నా, అలెగ్జాండర్ కార్డినాల్ అనే దంపతులకు పిల్లలు పుట్టలేదు. వివాహం అయ్యి చాలా సంవత్సరాలైంది. కానీ పిల్లలు లేరనే బాధ పెరుగుతోంది. ఈక్రమంలో కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్‌) ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. దాంట్లో భాగంగానే దంపతులిద్దరు ఓ ఐవీఎఫ్‌ కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడ డాక్టర్లతో తమ గురించి చెప్పారు. ఐవీఎఫ్‌ గురించి డాక్టర్లు అంతా వివరంగా చెప్పారు. దానికి ఓకే అన్నారు అలెగ్జాండర్ దంపతులు. అలా ఐవీఎఫ్ డఫ్నా గర్భవతి అయింది. నెలలు నిండాయి. సెప్టెంబరు 2019లో లాస్ ఏంజిల్స్ హాస్పిటల్ డఫ్నా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎంతో సంతోషపడిపోయారు దంపతులిద్దరు. కానీ బిడ్డకు చూడా అనుమానం వచ్చింది. బిడ్డ రంగు, ఒత్తైన నల్లటి జుట్టు..చూసి ఆశ్చర్యపోయారు. తమ కుటుంబంలో ఎవరికి ఇటువంటి బిడ్డ పుట్టలేదు. ఇటువంటి శరీర రంగు..జుట్టు లేవు.

Read more : Padma Shri : పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ..

కానీ బిడ్డ పుట్టిన సంతోషంలో అవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ రోజులు గడిచే కొద్దీ పెరుగుతున్న బిడ్డను చూస్తున్నవారిలో అనుమానం కూడా పెరుగుతు వచ్చింది. దీంతో డఫ్నా దంపతులు వారి బిడ్డకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించారు. ఫలితాలు వారిద్దరిలో ఎవరితో కూడా సరిపోలేదు. దాంతో వారి అనుమానం మరింత బలపడింది. తాము సంప్రదించిన ఐవీఎఫ్‌ కేంద్రానికి వెళ్లి.. విషయం చెప్పారు. దానికి సదరు సెంటర్ వాళ్లు మిస్టేక్ ఏమీ జరగలేదు. అంటూ సమర్ధించుకోబోయారు. కానీ డఫ్నా దంపతులు గట్టిగా అడిగి నిలదీసేసరికి అసలు నిజం బయటపడింది. డఫ్నా దంపతులు ఐవీఎఫ్‌ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మరో జంట కూడా అదే పద్దతిలో బిడ్డ కోసం పక్కనే ఉన్న క్లినిక్‌కు వచ్చారు. అయితే ఈ రెండింటిలో పని చేసేది ఒక్కడే డాక్టర్‌. ఫలితంగా సదరు డాక్టర్‌ పొరపాటున ఇరువురి పిండాలను తారుమారు చేయటంతో ఈ పొరపాటు జరిగింది.

Read more : New Zealand : ‘మేం లాబరేటరీలో ఎలుకలం కాదు..ఆ నాటి స్వేచ్ఛ మాక్కావాలి’ : పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు

అంటే డఫ్నా దంపతుల పిండాన్ని వేరే వారి గర్భంలో.. వారి పిండాన్ని డఫ్నా గర్భంలో ప్రవేశపెట్టాడు. జుట్టు, శరీర ఛాయ వేరుగా ఉండటంతో అనుమానం రావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు సదరు ఐవీఎఫ్‌ కేంద్రం మీద కేసు పెట్టారు. తమ జన్యుపరమైన బిడ్డను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రెండు జంటలు తమ తమ జన్యుపరమైన బిడ్డలను పరస్పరం మార్చుకుని… సొంత బిడ్డలతో ఇంటికి వెళ్లారు. కానీ నవమాసాలు మోసి కన్నబిడ్డలపై మమకారం సంగతి ఏంటీ? అనే ప్రశ్న వస్తుంది. ఈ సందర్భంగా డఫ్నా దంపతులు తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. మేం వేసిన లాసూట్‌ ద్వారా భావోద్వేగ నష్టాలు, పరిహారం,ఆస్తి నష్టాలు, అలాగే అనేక రకాల ఖర్చులను కోరుతున్నామని అని తెలిపారు. మరి కడుపులో మోసం కన్న మమకారం మాత్రం పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది…!! తాను కన్నబిడ్డ తన బిడ్డ కాదా? వేరే తల్లి కడుపులో పెరిగి పుట్టిన బిడ్డ తన బిడ్డే అయితే తను నవమాసాలు మెసి కన్నబిడ్డ తనకేమీ కాదా? ఇది న్యాయస్థానాలు కూడా తేల్చలేని ప్రశ్న.బంధాలు, భావోద్వేగాలకు చెందిన శేష ప్రశ్న..!!