india-china: సైన్యాన్ని వాడాల‌నుకోవ‌డం కాలం చెల్లిన విధానం: ద‌లైలామా

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల వ‌ద్ద నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై బౌద్ధ‌మ‌త గురువు ద‌లైలామా స్పందించారు. ధ‌ర్మ‌శాల నుంచి జ‌మ్మూక‌శ్మీర్‌కు వెళ్ళిన ఆయ‌న అక్క‌డ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ల‌ద్దాఖ్‌లోని లేహ్‌కు ప‌య‌న‌మ‌య్యారు.

india-china: సైన్యాన్ని వాడాల‌నుకోవ‌డం కాలం చెల్లిన విధానం: ద‌లైలామా

Dalai Lama

Dalai Lama: భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల వ‌ద్ద నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై బౌద్ధ‌మ‌త గురువు ద‌లైలామా స్పందించారు. ధ‌ర్మ‌శాల నుంచి జ‌మ్మూక‌శ్మీర్‌కు వెళ్ళిన ఆయ‌న అక్క‌డ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ల‌ద్దాఖ్‌లోని లేహ్‌కు ప‌య‌న‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడుతూ… భార‌త్‌, చైనా భారీగా జ‌నాభా ఉన్న దేశాల‌ని అన్నారు. సరిహ‌ద్దు స‌మస్య‌పై భార‌త్‌, చైనా ఇప్పుడు కాక‌పోతే భ‌విష్య‌త్తులో చ‌ర్చ‌ల ద్వారా శాంతియుతంగా ప‌రిష్కారాన్ని క‌నుగొంటాయ‌ని చెప్పారు. అంతేగానీ, స‌మ‌స్య వ‌స్తే సైన్యాన్ని వాడాల‌నుకోవ‌డం కాలం చెల్లిన విధాన‌మ‌ని ఆయ‌న చెప్పారు.

Justice Lalit : పిల్లలు7గంటలకే స్కూలుకెల్తున్నారు..కోర్టు 9 గంటలకే ఎందుకు ప్రారంభించకూడదు..?

కాగా, తూర్పు లద్దాఖ్‌కు స‌మీపంలో చైనా ప‌దే ప‌దే దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డంతో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ద‌లైలామా ల‌ద్దాఖ్ ప‌ర్య‌ట‌నపై కూడా చైనా అభ్యంత‌రాలు తెలిపింది. చైనాలోని కొంద‌రు త‌న‌ను వేర్పాటువాదిగా ప‌రిగణిస్తున్నార‌ని దలైలామా నిన్న‌ అన్నారు. తాను చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడ‌గ‌ట్లేద‌ని చెప్పారు. టిబెట్‌కు అర్థ‌వంత‌మైన స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉండాల‌ని, అక్క‌డ‌ బౌద్ధ‌మ‌త సంస్కృతిని సంర‌క్షించాల‌ని అడుగుతున్నాన‌ని తెలిపారు. కాగా, రేపు చైనా, భార‌త్ మ‌ధ్య క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సి ఉంది.