Coconut Cultivation : కొబ్బరి తోటల్లో సేంద్రీయ ఎరువుల వినియోగం!

ముఖ్యంగా తేలిక నేలల్లో తేమను ఎక్కువ కాలము ఉండేట్లు చేయటంలో సేంద్రీయ ఎరువులు సహాయకారిగా ఉంటాయి. భూమిలో ముఖ్యపదార్ధమైన సేంద్రీయ కర్బనం పెరిగేలా చేస్తుంది.

Coconut Cultivation : కొబ్బరి తోటల్లో సేంద్రీయ ఎరువుల వినియోగం!

Coconut Cultivation

Coconut Cultivation : ఆధునిక సేధ్యపు పద్దతులు పాటించటం ద్వారా రైతులు కొబ్బరిలో మంచి దిగుబడిని పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో కొబ్బరి సాగు అధిక విస్తీర్ణంలో రైతులు చేపడుతున్నారు. కొబ్బరిలో ఎరువులను అందించే విషయంలో రైతులు సరైన పద్దతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. శాస్త్రీయమైన ఆధునిక సేధ్యపు పద్దతులు పాటించటం ద్వారా రైతులు కొబ్బరిలో మంచి దిగుబడి సాధించవచ్చు.

కొబ్బరి సాగులో సేంద్రీయ ఎరువులు వినియోగించటం వల్ల కొబ్బరి పంటతోపాటు, రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా తేలిక నేలల్లో తేమను ఎక్కువ కాలము ఉండేట్లు చేయటంలో సేంద్రీయ ఎరువులు సహాయకారిగా ఉంటాయి. భూమిలో ముఖ్యపదార్ధమైన సేంద్రీయ కర్బనం పెరిగేలా చేస్తుంది. భూమిలో సూక్ష్మజీవుల సంతతి పెంచి, తద్వారా మట్టిలో మొక్కల వేర్లను పోషకాల లభ్యత పెంచుతుంది. భూమిలో అధిక మోతాదులో ఉన్న లవణములను చౌడును తగ్గిస్తుంది. సేంద్రీయపు ఎరువులను కొబ్బరి తోటల్లో ప్రతి సంవత్సరము వాడుట వలన భూమిలో లభ్యమయ్యే పోషకాలు క్రమేపీ పెరిగి మొక్కలు ఏపుగా పెరిగేందుకు సహాయపడుతుంది.

కొబ్బరిలో సేంద్రీయ ఎరువుల వాడకం ;

వర్మికంపోస్ట్ : కొబ్బరి తోటలలో వ్యర్థపదార్ధాలైన ఎండు ఆకులను ‘యత్రీలస్’ అనే వానపాముల ద్వారా ఆవు పేడ మరియు ఆకులు 1 1 నిష్పత్తిలో వర్మికంపోస్ట్న తయారు చేయవచ్చును. 10 కిలోల సేంద్రియ పదార్ధములకు వర్మి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. 10 కిలోల సంద్రియ పదార్ధముకు 50 వానపాముల చొప్పున వాడుకోవచ్చు. 1-3 నెలల్లో సేంద్రీయ పదార్ధం కుళ్లి చక్కని వర్మికంపోస్ట్ తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో సుమా 1.8% నత్రజని, 1% భాస్వరం, 0.16% పొటాషియం మొదలగు పోషకము ఉంటాయి. ఈ పద్ధతిలో కంపోస్ట్ను కొబ్బరిచెట్టు చుట్టూ గాడిచే గాడిలో కొబ్బరి ఆకులకు వానపాములను చేర్చి, గాడిలోనే ఎరువు. మార్చుకోవచ్చు. సుమారు 90 రోజులలో ఎరువు తయారవుతుంది.

చిక్కటి సేంద్రీయపు ఎరువులు: వేపపిండి, గానుగపిండి, వేరుశనగపిండి మొదలగు సేంద్రీయపు ఎరువులలో 3-8% వరకు నత్రజని, 1-2% భాస్వరం, పొటాషియం ఉంటుంది. వీటిని కూడా సేంద్రీయపు ఎరువులుగా చెట్టుకు 2-5 కిలోల చొప్పున వాడుకోవచ్చు.

కొబ్బరి పొట్టు కంపోస్ట్ : పొట్టును కుళ్లించు పూరోటస్ అను శిలీంధ్రము పొడిని (0.2%) ఉపయోగించి, సున్నము (5%), యూరియా (0.5%), రాక్ ఫాస్ఫేట్ (0.5%) మరియు ఆవుపేడ కలిపి కొబ్బరి పాట్టునుంచి ఎరువు తయారుచేసుకొనవచ్చును. సుమారు 2, 3 నెలల్లో కంపోస్ట్ ఎరువు తయారవుతుంది.. ఈ ఎరువునందు సుమారు 1.2 1.8% నత్రజని, 0.1 0.22% భాస్వరం, 0.1 0.4% పొటాషియం పోషకాలుటాయి. ఈ ఎరువును కొబ్బరి చెట్టుకు 20-25 కిలోల వరకు వాడుకోవచ్చు.

స్థూల సేంద్రీయపు ఎరువులు : కంపోస్ట్ ఎరువు, పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేక లేక గొర్రెల ఎరువు మొదలగు స్థూల సేంద్రీయపు ఎరువుల్లో పోషకపు విలువలు తక్కవుగా ఉన్నా..మిగిలిన లాభాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఎరువులు మట్టిలో కలిసి భూమిని గుల్లబార్చి, తేమ ఎక్కువగా భూమిలో ఇంకేలా చేస్తాయి. ఈ ఎరువులో సుమారు 1-2 నత్రజని, 0.5 భాస్వరం మరియు 1% పొటాషియం కలిగి ఉంటాయి.

పచ్చిరొట్ట ఎరువులు: పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, బొబ్బర్లు (అలసంద) తొలకరి వర్షాలు పడగానే పెంచి, సుమారు 2 నెలలు తరువాత దుక్కిలో బాగుగా కలియ దున్నాలి. ఈ పచ్చిరొట్ట పైరుల వలన భూమిలో నత్రజని (6-7%), భాస్వరం (1-2%) మరియు పొటాష్ (4-5%) మొదలగు ముఖ్యపోషకాలు మొక్కలకు అందుతాయి. ఇవే కాకుండా అనేక సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు లభిస్తాయి.