జులై 01న స్కూల్స్ ఓపెన్..వారికి మాత్రమే..ఎక్కడో తెలుసా

  • Published By: madhu ,Published On : June 23, 2020 / 04:53 AM IST
జులై 01న స్కూల్స్ ఓపెన్..వారికి మాత్రమే..ఎక్కడో తెలుసా

కరోనా వేళ…అన్నీ బంద్ అయిపోయాయి. లాక్ డౌన్ కారణంగా..ఆర్థిక పరిస్థితి కుదేలయి పోయింది. అన్నీ రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా విద్యారంగంపై ఎఫెక్ట్ పడింది. ఇప్పటికీ స్కూల్స్ ఓపెన్ కాలేదు. కొన్ని రాష్ట్రాలు..ఆన్ లైన్ ద్వారా విద్యాబోధనం చేస్తున్నారు.

ఇంకా స్కూల్స్ ఓపెన్ కాకపోవడంతో విద్యా రంగం ఇంకా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఓ రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ ఇందుకో కండీషన్ పెట్టింది. 

యూపీలోని ప్రభుత్వ స్కూళ్లు 2020, జులై 01 నుంచి తెరుచుకోనున్నాయి. కానీ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రాథమిక విద్య డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. స్కూళ్లకు వచ్చే ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు కొన్ని పనులు చేపట్టింది. ముందుగా..శారదా అభియాన్ కింద 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను పాఠశాలలో చేరిపించాల్సి ఉంటుంది.

గ్రామాల్లో ఉపాధ్యాయులు పర్యటించి..పిల్లల వివరాలను సేకరించి..వారి కోసం విద్యా ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది.దీక్షా యాప్ ద్వారా నూతన అంశాలలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. వివిధ తరగతుల విద్యార్థులకు పుస్తకాలను అందజేయాలి. విద్యార్థుల యూనిఫారాలకు సంబంధించిన పనులను చేపట్టాలి. 

Read: ప్లాస్మా దానం చేస్తానని..అసెంబ్లీ స్పీకర్ నే బురిడీ కొట్టించిన కేటుగాడు: కరోనా దందాలు