Running Train : తీవ్ర విషాదం.. ఏపీ వెళ్లే రైలు కాదని దూకేశారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

యూపీలోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంగారు ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకరి ప్రాణం తీసింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Running Train : తీవ్ర విషాదం.. ఏపీ వెళ్లే రైలు కాదని దూకేశారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

Running Train

Running Train : యూపీలోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంగారు ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకరి ప్రాణం తీసింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైలు ఎక్కబోయి మరో రైలు ఎక్కామన్న కంగారులో ఐదుగురు ప్రయాణికులు కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

మృతుడిని గోరఖ్‌పూర్‌లోని దేవ్‌కాళి ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (33)గా రైల్వే పోలీసులు గుర్తించారు. అజయ్ తన అంకుల్ జగ్‌మోహన్, సోదరుడు విజయ్‌, తన స్నేహితులు సందీప్, సంజయ్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్(రాజమండ్రి) వెళ్లేందుకు బుధవారం రాత్రి ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. రాత్రి 12:30 గంటల సమయంలో ఏపీ రైలు అనుకుని వీరంతా ఢిల్లీ వైపు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు.

రైలు కదిలిన కాసేపటికి ఢిల్లీ వెళ్తుందని తెలియడంతో కంగారు పడ్డారు. మరో ఆలోచన చేయకుండా కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఆ సమయంలో అజయ్ రైలు కింద పడడంతో స్పాట్ లోనే చనిపోయాడు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు.

”ట్రైన్ కిలోమీటర్ దూరం వెళ్లాక వారికి విషయం తెలిసింది. తాము ఎక్కింది మరో రైలు అని తెలిసింది. వెంటనే 5 మంది రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశారు. వాళ్లు ఢిల్లీ-విశాఖపట్నం(02806) రైలు ఎక్కాల్సి ఉంది. కానీ పొరపాటున విశాఖపట్నం-ఢిల్లీ(02805) వెళ్లే రైలు ఎక్కారు. ప్రమాదం గురించి మాకు అర్థరాత్రి 2గంటలకు సమాచారం అందింది” అని గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.