Uttar Pradesh: గుడిలోకి మాంసం ముక్కలు విసరడంతో ఆందోళనలు

గుడి ప్రాంగణంలో మాంసపు ముక్కలు విసరడంతో పాటు రెండు చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారంటూ యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఆందోళనలు చెలరేగాయి. ఇందులో భాగంగా పలు దుకాణాలకు సైతం నిప్పంటిచినట్లు పోలీసులు తెలిపారు. స్మశానం గేటును సైతం ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

Uttar Pradesh: గుడిలోకి మాంసం ముక్కలు విసరడంతో ఆందోళనలు

Uttar Pradesh

 

 

Uttar Pradesh: గుడి ప్రాంగణంలో మాంసపు ముక్కలు విసరడంతో పాటు రెండు చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారంటూ యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఆందోళనలు చెలరేగాయి. ఇందులో భాగంగా పలు దుకాణాలకు సైతం నిప్పంటిచినట్లు పోలీసులు తెలిపారు. స్మశానం గేటును సైతం ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

తల్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూలాబాద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గుడికి పూజారి వెళ్లేసరికి ఆ ప్రాంగణంలో మాంసం ముక్కలు పడి ఉన్నట్లు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివ్ ప్రతాప్ సింగ్, స్టేషన్ ఆఫీసర్ హరి శ్యామ్ సింగ్ ఘటనాస్థలానికి వెళ్లి.. ప్రాంతాన్ని క్లీన్ చేయించారు. పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ రోడ్ మీద గుంపులు చేరి సరైన న్యాయం చేయలేకపోయారంటూ నిరసన వ్యక్తం చేశారు. మూడుగంటల పాటు అల్లర్లు చెలరేగకుండా నిరసనకారులను బ్లాక్ చేశారు పోలీసులు.

Read Also : మసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు : ఈద్గా ఇమామ్

ఆందోళనకారులు కోపంతో నాలుగు షాపులు ధ్వంసం చేయడంతో పాటు స్మశానం గేటును కూడా ధ్వంసం చేశారు. శనివారం సాయంత్రం సమాయానికి ఐజీ, కమిషనర్ ప్రశాంత్ కుమార్, రాజశేఖర్ తల్‌గ్రామ్ గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నామని, అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మెజిస్ట్రేట్ రాకేశ్ మిశ్రా అన్నారు.