VHanumantha Rao Cloud Burst : వరదల వెనుక విదేశీ కుట్ర.. కేసీఆర్ వ్యాఖ్యలపై వీహెచ్ సెటైర్లు

క్లౌడ్ బరస్ట్, గోదావరి వరదలు విదేశాల కుట్ర అన్న కేసీఆర్ వ్యాఖ్యలను వీహెచ్ తప్పుపట్టారు. కేసీఆర్.. సీఎం స్థాయిలో మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు.(VHanumantha Rao Cloud Burst)

VHanumantha Rao Cloud Burst : వరదల వెనుక విదేశీ కుట్ర.. కేసీఆర్ వ్యాఖ్యలపై వీహెచ్ సెటైర్లు

V Hanumantha Rao

VHanumantha Rao Cloud Burst : క్లౌడ్ బరస్ట్, గోదావరి ఆకస్మిక వరదలు.. విదేశాల కుట్ర అన్న కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తప్పుపట్టారు. కేసీఆర్.. సీఎం స్థాయిలో మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల పరిహారం సరిపోదని వీహెచ్ అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

”కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశాల్లో వరదలపై చర్చ జరిగింది. సీఎం కేసీఆర్, గవర్నర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం మంచిదే. వరదలు విదేశాల కుట్ర అనడం కేసీఆర్ స్థాయికి తగదు. వరద బాధితులకు రూ.10వేల ఆర్థికసాయం సరిపోదు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంట పొలాలు, ఇళ్లు పోయాయి. తినేందుకు తిండి లేదు. వరద బాధితులను ఆదుకోవాలి.

CM KCR : సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..ఆకస్మిక వరదల వెనుక విదేశీ కుట్రలు

వరద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఇద్దరూ తిరగడం మంచిదే. ప్రజలకు లాభం కలుగుతుంది. బాధితుల బాగోగులు చూడాలి. వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.10వేల సాయం సరిపోదు. ఇసుకు తీసేందుకే రూ.10వేలు అవుతుంది. కేసీఆర్ చదువుకున్నోడు. పుస్తకాలు చదువుతాడు. విదేశాలకు వెళ్తాడు. వరదలు విదేశీ కుట్ర అనడం హాస్యాస్పదం. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా కేసీఆర్ మాట్లాడలేదు” అని వీహెచ్ అన్నారు.(VHanumantha Rao Cloud Burst)

Cloudburst : సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన క్లౌడ్ బరస్ట్ అంటే …..

వరదల వెనుక విదేశాల కుట్ర ఉండొచ్చంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అభివర్ణించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తప్పిదాలతోనే కాళేశ్వరం మునిగిపోయిందన్నారు. 10 వేల ఇళ్లతో కాలనీ, కరకట్ట నిర్మాణం పేరుతో మళ్లీ వంచించే హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.(VHanumantha Rao Cloud Burst)

దేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ (ఒక్కసారిగా భారీ వర్షాలు పడటం) జరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. ఇది వరకు కశ్మీర్, లేహ్ ప్రాంతాల్లో ఇలానే క్లౌడ్ బరస్ట్ తో వరదలు సృష్టించేందుకు ఇతర దేశాల నుంచి కుట్ర జరిగినట్టు ప్రచారం జరిగిందన్నారు.

Cloudburst: అందుకే సీఎం కేసీఆర్ ‘క్లౌడ్ బ‌ర‌స్ట్’ అన్నారు: ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి

ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ క్లౌడ్ బరస్ట్ చేశారనే అనుమానాలు కలుగుతున్నాయని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రాచలంలో గోదావరి వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. వరదల వెనుక విదేశీ హస్తం ఉండొచ్చని ఆయన అనడం సంచలనంగా మారింది.(VHanumantha Rao Cloud Burst)

వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వేను రద్దు చేసుకున్న సీఎం కేసీఆర్ ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, గోదావరికి వరద పోటెత్తడం వెనుక విదేశీ కుట్రకోణం ఉండొచ్చని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కేసీఆర్ వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపడుతున్నాయి.