ముందుకు సాగని వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. మొరాయించిన ఆరోగ్యసేతు, cowin..

దేశంలో 18 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం అయింది. ఆరోగ్యసేతు, cowin వెబ్ సైట్ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ముందుకు సాగని వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. మొరాయించిన ఆరోగ్యసేతు, cowin..

Vaccine Registration Process Not Going Ahead Due To Technical Problem

 cowin : దేశంలో 18 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం అయింది. ఆరోగ్యసేతు, cowin వెబ్ సైట్ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే దేశవ్యాప్తంగా ఈ యాప్, వెబ్ సైట్ లను ఒక్కసారిగా ఓపెన్ చెయ్యడంతో ఇవి మొరాయించాయి.. కొంతమందికి cowin వెబ్ సైట్ అసలు ఓపెన్ కావడం లేదు.. ఒకవేళ ఓపెన్ అయినా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ రావడంలేదు..

కొందమందకి ఓటీపీ వచ్చినప్పటికీ దాన్ని ఎంటర్ చేసినా రిజిస్ట్రేషన్ ట్యాబ్ ఓపెన్ కావడంలేదు.. ఇక ఆరోగ్యసేతు యాప్ లో కూడా ఇదే సాంకేతికలోపం చూపిస్తుంది.. వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా వీటిని ఓపెన్ చెయ్యడంతో సర్వర్ డౌన్ అయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోతున్నాయి. దీంతో ఈ సాంకేతిక లోపాన్ని సరిచేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్యశాఖకు ట్వీట్లు పెడుతున్నారు.