Covid Vaccine: టీకా కుంభకోణం.. కోవిషీల్డ్ పేరిట నకిలీ వ్యాక్సిన్..!

కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్టుగా ఉంది మోసగాళ్ల తీరు. మొన్నటి వరకు రెమిడీసీవీర్ దందా.. ఈ మధ్యనే బ్లాక్ ఫంగస్ మందులు.. నేడు నకిలీ వ్యాక్సిన్లు.. కరోనా చుట్టూ పెద్ద స్కామ్స్ ప్లాన్ చేసి కొందరు కాసుల పోగేసుకుంటున్నారు. మందులు, వ్యాక్సిన్లు అధిక ధరలకు అమ్మడమే కాదు..

Covid Vaccine: టీకా కుంభకోణం.. కోవిషీల్డ్ పేరిట నకిలీ వ్యాక్సిన్..!

Covid Vaccine

Covid Vaccine: కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్టుగా ఉంది మోసగాళ్ల తీరు. మొన్నటి వరకు రెమిడీసీవీర్ దందా.. ఈ మధ్యనే బ్లాక్ ఫంగస్ మందులు.. నేడు నకిలీ వ్యాక్సిన్లు.. కరోనా చుట్టూ పెద్ద స్కామ్స్ ప్లాన్ చేసి కొందరు కాసుల పోగేసుకుంటున్నారు. మందులు, వ్యాక్సిన్లు అధిక ధరలకు అమ్మడమే కాదు.. అసలు మందులను పక్కనబెట్టి నకిలీ మందులను అంటగట్టి లక్షలు దోచేసుకున్న ఉదంతాలు ఇప్పటికే మనం వార్తలలో చూడగా ఇప్పుడు నకిలీ వ్యాక్సిన్ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది.

కోవిషిల్డ్ పేరిట వ్యాక్సిన్లు విక్రయించగా బాధితులు నిజమేనని నమ్మి తీసుకున్నారు. కానీ ఎన్నిరోజులైనా తాము టీకా తీసుకున్నట్లుగా మెసేజ్ రాకపోవడంతో అనుమానించిన బాధితులు తీగ లాగితే డొంక కదిలింది. అసలు వాళ్ళు తీసుకుంది నిజమైన కోవిషిల్డ్ వ్యాక్సిన్ కాదని తేలడంతో లబోదిబోమనడం వారి వంతైంది. ముంబైలో ఈ కుంభకోణం బయటపడింది. ముంబైలోని కందివాలి ప్రాంతంలోని హిరానాందానీ ఎస్టేట్ సొసైటీలో మే 30న కరోనా వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించగా అందులో సుమారు 390 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ డోసులను తీసుకున్నారు.

అయితే.. ఎన్నిరోజులైనా వారికి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా మెసేజ్ రాకపోవడం అనుమానంతో విచారిస్తే ఆ వ్యాక్సిన్లు నకిలీవని తేలడంతో సోసైటీ సభ్యులు లబోదిబోమంటున్నారు. రాజేష్ పాండే అనే వ్యక్తి కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి ప్రతినిధిగా వచ్చి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేస్తామని సోసైటీ సభ్యులను సంప్రదించాడు. డోసుకు రూ.1,260 చొప్పున రూ.5లక్షలు చెల్లించి సొసైటీ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించింది. 390 మంది ఈ డ్రైవ్లో పాల్గొని వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ చివరికి అవి నకిలీవని తేలింది. దీంతో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.