వణుకు పుట్టిస్తున్న వైభవ్ సినిమా స్నీక్ పీక్..

వణుకు పుట్టిస్తున్న వైభవ్ సినిమా స్నీక్ పీక్..

Katteri – Sneak Peak: ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామి రెడ్డి తనయుడిగా సినిమా ఫీల్డ్‌లోకి వచ్చినా.. తమిళనాట తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు వైభవ్.. తెలుగులో ‘గొడవ’, ‘కాస్కో’ వంటి సినిమాలు చేసిన తర్వాత కోలీవుడ్‌లో సెటిలైపోయాడు. ‘గోవా’, ‘సరోజ’, ‘గ్యాంబ్లర్’, ‘ఇరైవి’ వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ‘కాటేరి’ అనే అడ్వెంచర్ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. మంగళవారం ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోనే ఇలా ఉందంటే.. ఇక సినిమా చూస్తే భయంతో వెన్నులో వణుకు పుట్టడం గ్యారెంటీ అనిపిస్తోంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, సోనమ్ బజ్వా, ఆత్మిక, కరుణాకరన్ కీలకపాత్రల్లో నటించారు.

స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి సంగీతం : ప్రసాద్ ఎస్ఎన్, కెమెరా : విఘ్నేష్ వాసు, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, లిరిక్స్ : శ్రీకాంత్ వరదన్, ఫైట్స్ : డాన్ అశోక్, రచన – దర్శకత్వం : డీకే.