Vaishnav Tej: రాముడు కాదప్ప.. రుద్ర కాళేశ్వరుడు..!

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేసి, తొలిసినిమాతోనే గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.....

Vaishnav Tej: రాముడు కాదప్ప.. రుద్ర కాళేశ్వరుడు..!

Vaishnav Tej: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేసి, తొలిసినిమాతోనే గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. అయితే తాజాగా మరో కొత్త ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు ఈ మెగా హీరో. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పంజా వైష్ణవ్ తేజ్ 4వ చిత్రాంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.

Vaishnav Tej: మరోటి మొదలుపెడుతున్న మెగా హీరో!

సితార ఎంరట్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాను దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ డైలాగ్ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.. ఈ వీడియో టీజర్ లో ‘‘ రేయ్.. రాముడు లంక మీద పడటం వినుంటావ్.. అదే పది తలకాయలోడు ఇంటి మీద పడితే ఎట్టా ఉంటాదో చూస్తావా.. అని విలన్ మాట్లాడితే.. ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్ప.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. తలలు కొసి చేతికిస్తా నాయాలా.. ’’ అంటూ వైష్ణవ్ తేజ్ ఇంటెన్సిటీతో చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

Vaishnav Tej : త్రివిక్రమ్‌తో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ సినిమా..

మొత్తానికి ఈసారి పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో మనముందుకు వచ్చేందుకు వైష్ణవ్ తేజ్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాలో ఆయన లుక్, పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అప్పుడే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన మిగతా టెక్నిషియన్స్, నటీనటుల గురించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.