‘వకీల్ సాబ్’ వచ్చేస్తున్నాడు..

‘వకీల్ సాబ్’ వచ్చేస్తున్నాడు..

Vakeel Saab: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి రెస్పాన్స్ అదిరిపోయింది..

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ ప్రకటించారు.. వేసవి కానుకగా ఏప్రిల్ 9న పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’ గా థియేటర్లలో దర్శనమివ్వనున్నారు. రిలీజ్ డేట్‌తో వదిలిన పోస్టర్‌లో యాక్షన్ మోడ్‌లో తన మార్క్ ఎర్ర కండువాతో కనిపించి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చారు పవన్.

Vakeel Saab

ఈ మూవీలో విమెన్ ఎమ్‌పవర్‌మెంట్ కోసం పోరాడే లాయర్‌గా సరికొత్తగా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. సినిమా ఎలాంటిదైనా.. పవన్‌కున్న క్రేజే వేరు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు పవన్ కళ్యాణ్‌ని కొత్తగా చూపించబోతున్న ‘వకీల్ సాబ్’ చిత్రానికి థమన్ సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.