వాలెంటైన్స్ డే అప్‌డేట్స్ వస్తున్నాయి..

వాలెంటైన్స్ డే అప్‌డేట్స్ వస్తున్నాయి..

Valentines Day: వాలెంటైన్స్ డే రోజు తమ సినిమాల అప్‌డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయిపోతున్నారు. ‘రెబల్ స్టార్’ ప్రభాస్, ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్, ‘యువ సామ్రాట్’ అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా కబుర్లతో ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ను పలకరించబోతున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా 70 కాలంలో రోమ్ బ్యాక్ డ్రాప్‌లో రెట్రో లవ్ స్టోరీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చెయ్యనున్నట్లు తెలుపుతూ.. ప్రీ టీజర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. టీజర్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Radhe Shyam

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.. ప్రేమికుల దినోత్సవం రోజు ఈ సినిమాలోని రెండో పాట రిలీజ్ చెయ్యనున్నారు. గతేడాది వుమెన్స్ డే కానుకగా విడుదల చేసిన ‘మగువా.. మగువా’.. పాటకు ఏ స్థాయిలో స్పందన లభించిందో తెలిసిందే. వేసవి కానుకగా ఏప్రిల్ 9న పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’ గా థియేటర్లలో దర్శనమివ్వనున్నారు. రిలీజ్ డేట్‌తో వదిలిన పోస్టర్‌లో యాక్షన్ మోడ్‌లో తన మార్క్ ఎర్ర కండువాతో కనిపించి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చారు పవన్.

Vakeel Saab

‘యువ సామ్రాట్’ అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా ‘లవ్ స్టోరీ’ కూడా పేరుకి తగ్గట్టే వాలెంటైన్స్ డే నాడు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోలకు రెస్పాన్స్ బాగుంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ లేదా న్యూ పోస్టర్ రిలీజ్ చెయ్యనున్నారు. ఏప్రిల్ 16న సినిమా విడుదలవుతోంది.

 Love Story