Valimai: ఓటీటీలో వలిమై కొత్త రికార్డు

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ మూవీ ‘వలిమై’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్....

Valimai: ఓటీటీలో వలిమై కొత్త రికార్డు

Valimai: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ మూవీ ‘వలిమై’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాలో అజిత్ స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూసేందుకు ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 24న బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ రిలీజ్ చేశారు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దుమ్ములేపింది. అయితే టాలీవుడ్‌లో ఈ సినిమాకు పోటీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కావడంతో వలిమై చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.

Valimai: ఓటీటీలో అజిత్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అయితే ఈ సినిమాను ఇటీవల ఓటీటీలో రిలీజ్ చేయగా, అక్కడ కూడా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ దక్కింది. జీ5 ఓటీటీలో వలిమై చిత్రాన్ని మార్చి 24 నుండి స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు నెటిజన్లు ఇప్పటివరకు ఏకంగా 200 మిలియన్ నిమిషాల పాటు స్ట్రీమింగ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇటీవల కాలంలో ఇంతటి స్ట్రీమింగ్ నిమిషాలు మరే ఇతర సినిమాకు రాలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఖచ్చితంగా అజిత్ క్రేజ్‌కు నిదర్శనమని వారు అంటున్నారు.

Valimai: ఓటీటీలో వలిమై రికార్డ్.. 24 గంటల్లో 100 మిలియన్ మినిట్స్‌ స్ట్రీమింగ్!

ఇక ఈ సినిమాలో అజిత్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, తెలుగు యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. కాగా బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖురేషీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు పి.వినోద్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. యువన్ శంకర్ రాజా, గిబ్రాన్‌లు ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.