Varisu: కేరళలో వారిసు రైట్స్‌కు భారీ రేటు.. విజయ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో కేవలం తమిళనాటే కాకుండా ఇతర రాష్ట్రాల బాక్సాఫీస్‌లను సైతం షేక్ చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు.

Varisu: కేరళలో వారిసు రైట్స్‌కు భారీ రేటు.. విజయ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్!

Varisu Kerala Rights Sold For A Bomb Price

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో కేవలం తమిళనాటే కాకుండా ఇతర రాష్ట్రాల బాక్సాఫీస్‌లను సైతం షేక్ చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ లుక్స్ పరంగా అల్ట్రా స్టైలిష్‌గా కనిపించబోతున్నాడని, ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Varisu: ‘వారిసు’ అప్డేట్‌తో గుర్రుమంటున్న విజయ్ ఫ్యాన్స్..?

అయితే ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే కేరళలోనూ ‘వారిసు’ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను అక్కడ కూడా మంచి అంచనాల మధ్య రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. అయితే తాజాగా కేరళలో వారిసు చిత్రానికి సంబంధించిన రైట్స్‌ను భారీ రేటుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. వారిసు కేరళ రైట్స్‌ను ఏకంగా రూ.6 కోట్లకు చిత్ర యూనిట్ అమ్మినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Varisu: విజయ్ వారసుడు ఫస్ట్ సింగిల్ ప్రోమోకు ముహూర్తం ఫిక్స్!

కేరళలో ఇప్పటివరకు విజయ్ సినిమాకు ఇదే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్‌గా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.