RGV OTT: వర్మ కొత్త ప్ర‌య‌త్నం.. స్పార్క్ పేరుతో సొంత ఓటీటీ!

సంచలనం అనే పేరుకు చిరునామా ఏదైనా ఉందంటే అది రామ్ గోపాల్ వర్మ అని చెప్తారు ఆయన అభిమానులు. నచ్చింది చేస్తాడు.. ఇష్టమొచ్చింది మాట్లాడతాడు.. ఎలా బ్రతకాలో కాంప్రమైజ్ కాకుండా అలానే బ్రతుకుతాడు.. ఇదే ఆయన నైజమని చెప్తుంటారు.

RGV OTT: వర్మ కొత్త ప్ర‌య‌త్నం.. స్పార్క్ పేరుతో సొంత ఓటీటీ!

Rgv Ott

RGV OTT: సంచలనం అనే పేరుకు చిరునామా ఏదైనా ఉందంటే అది రామ్ గోపాల్ వర్మ అని చెప్తారు ఆయన అభిమానులు. నచ్చింది చేస్తాడు.. ఇష్టమొచ్చింది మాట్లాడతాడు.. ఎలా బ్రతకాలో కాంప్రమైజ్ కాకుండా అలానే బ్రతుకుతాడు.. ఇదే ఆయన నైజమని చెప్తుంటారు. అయితే, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ కూడా ఆయనేనని ఇండస్ట్రీలో వినిపించే మాట. కాగా, గత ఏడాది కరోనా దెబ్బకు అందరూ ఇళ్లకే పరిమితమైతే ఎప్పుడు.. ఎలా తీశాడో ఏమో కానీ వరసబెట్టి డిజిటల్ లో సినిమాలు విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇక, ఇప్పుడు తానే సొంతంగా మరో ఓటీటీని తీసుకొస్తున్నాడు ఆర్జీవీ. ప్రముఖ టీవీ హోస్ట్ స్వప్న.. వర్ధమాన వ్యాపారవేత్త సాగర్ మచనూరు సహకారంతో స్పార్క్ పేరుతో ఈ OTT ప్లాట్ ఫామ్ యాప్ ను ప్రారంభించగా ఈనెల 15 నుండి స్ట్రీమింగ్ మొదలుకానుందట. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, ప్రభాస్‌, ప్రకాశ్‌ రాజ్‌, దగ్గుబాటి సురేశ్‌ బాబు, పూరి జగన్నాథ్‌, మంచు లక్ష్మీ, అడవి శేషు, బాలీవుడ్‌ హీరో రిషితేష్‌ దేశ్‌ముఖ్‌తో సహా పలువురు హీరో హీరోయిన్లు, నటీనటులు వర్మకు శుభాకాంక్షలు కూడా తెలిపగా వాటిని కలిపి ఒక వీడియో కూడా తయారు చేసి ప్రమోషన్ మొదలు పెట్టారు.

ప్రస్తుతం నెలకొన్న క‌రోనా ప‌రిస్థితులతో ప్రేక్షకులు థియేట‌ర్స్‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో డిజిట‌ల్ రంగంకు ఆద‌ర‌ణ బాగా ల‌భిస్తుండగా కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ ఆహా పేరుతో దూసుకుపోతుండగా నిర్మాత సురేష్ బాబు, అక్కినేని అండ్ కో కూడా త్వరలోనే ఓటీటీలు రానున్నాయని ప్రచారం జరుగుతుంది. కానీ ఇంతలోనే వర్మ మరో ఇద్దరితో కలిసి ఓటీటీలోకి దిగిపోయాడు. మరి ఈ ఓటీటీ ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి మరి!