‘మై బంగారుతల్లి.. డాషింగ్ బావా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్’..

  • Published By: sekhar ,Published On : December 11, 2020 / 04:41 PM IST
‘మై బంగారుతల్లి.. డాషింగ్ బావా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్’..

Varun Tej Post: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ.. డిసెంబర్ 9 రాత్రి 7:15 నిమిషాలకు మిథున లగ్నంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ అంగరంగవైభవంగా మూడు రోజులపాటు సంబరాలు జరిగాయి.
Niharika Konidela
తమ గారాలపట్టి మరో ఇంటికి కోడలిగా వెళ్తున్న సందర్భంగా నిహారిక తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవి భావోద్వేగభరితమైన ట్వీట్లు చేశారు. తాజాగా అన్నయ్య వరుణ్ తేజ్, కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.



‘విషింగ్ మై బంగారుతల్లి నిహారిక అండ్ మై డాషింగ్ బావ చైతన్య హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ.. వధువరులిద్దరినీ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తున్న ఫొటో షేర్ చేశాడు వరుణ్ తేజ్.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)