జూలై 30న ‘గని’..

జూలై 30న ‘గని’..

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న10వ సినిమా ‘గని’.. వరుణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్సాన్స్ వచ్చింది.
అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న ‘గని’ లో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయిక.. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్.. లాస్ ఏంజెల్స్‌లో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. గురువారం ఈ సినిమా విడుదల తేది ప్రకటించారు. ‘గని’ జూలై 30న థియేటర్లలోకి రానున్నాడని తెలియజేస్తూ కొత్త పోస్టర్ వదిలారు.

GHANI

ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్న ‘గని’ చిత్రానికి సంగీతం : థమన్, కెమెరా : జార్జ్ సి విలియమ్స్, ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్ : రవీందర్, డైలాగ్స్ : అబ్బూరి రవి, ఫైట్స్ : దిలీప్ సుబ్బరాయన్.