గుడ్డు ఖరీదు నెల జీతం కంటే ఎక్కువ..

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 11:40 AM IST
గుడ్డు ఖరీదు నెల జీతం కంటే ఎక్కువ..

ప్రపంచమంతా కరోనా మహమ్మారి భయానికి లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. ప్రజలకు నిత్యావసరాలు తప్పించి ఇతర వస్తువులు కొనడానికి లేదు. కొనుక్కునే అవసరమూలేదు. ఇదే అదనుగా భావించి బ్లాక్ మార్కెట్లో నిత్యవసరాల ధరలు పెంచకూడదని ప్రభుత్వమే ధరలను ఫిక్స్ చేసింది. వాటిని వెనెజులా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 

27నిత్యావసరాల ధరలు చూస్తే షాక్ అవుతారు. ఒక గుడ్డు ధర నెల జీతం కంటే ఎక్కువగా ఉందది. ప్రెసిడెంట్ నికోలస్ మదురో వాటిని నిర్ణయించారు. క్రూడ్ ఆయిల్ ధరల డిమాండ్ పడిపోవడంతో ఇతర వాటిపైనా భారీగా ప్రభావం కనిపిస్తుంది. వెన్న, పౌడర్ మిల్క్ ధరలు 4లక్షల బొలివర్సుగా ప్రకటించారు. ఇది రోజువారీ కూలీకి వచ్చే ఆధాయంతో సమానం. ఇది మారక ద్రవ్య రేటు ప్రకారం.. 2డాలర్లన్నమాట.(డిల్లీలో ప్రాణం తీసిన కోడి ధర..ఎందుకో తెలుసా)

ప్రైవేట్ ఫుడ్ ప్రొడక్షన్ కంపెనీలు ధరల నియంత్రణపై హెచ్చరికలు జారీ చేశాయి. దీని కారణంగా కొన్ని సంవత్సరాల పాటు ఆర్థికంగా నిలదొక్కుకోలేమంటూ వార్నింగ్ ఇచ్చాయి. సూపర్ మార్కెట్ సప్లై ఈ ఏడాది మెరుగైంది. ప్రభుత్వం ధరల నియంత్రణపై రిలాక్సేషన్ విధించిన తర్వాత మార్చిలో 3వేల 365శాతం పెరిగాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ప్రస్తుతమున్న వాటి కంటే తక్కువగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.