Venu Udugula: నక్సలిజం నుండి రాజకీయం.. వేణు మాస్టర్ ప్లాన్!

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాటపర్వం’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సిినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు వేణు ఊడుగుల తన నెక్ట్స్ మూవీ రాజకీయం నేపథ్యంలో రాబోతున్నట్లుగా తెలిపాడు.

Venu Udugula: నక్సలిజం నుండి రాజకీయం.. వేణు మాస్టర్ ప్లాన్!

Venu Udugula About His Next Project

Venu Udugula: టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్ వేణు ఊడుగుల ఇటీవల ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా కూడా కరోనా ప్రభావంతో రిలీజ్ చాలా ఆలస్యం అయ్యింది. ఇక ఈ సినిమాలో నక్సలిజం, ప్రేమ అనే అంశాలను సమానంగా డీల్ చేయడంలో వేణు ఊడుగుల తన ప్రతిభను చాటాడని సినీ క్రిటిక్స్ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

Virata Parvam: విరాటపర్వం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు!

అందాల భామ సాయి పల్లవికి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర పడితే ఎలా ఉంటుందో విరాటపర్వం సినిమాతో మరోసారి నిరూపించాడు ఈ డైరెక్టర్. ఇక ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ యంగ్ డైరెక్టర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాటపర్వం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతూ వచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ తన నెక్ట్స్ ప్రాజెక్టును పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. విరాటపర్వం నక్సలిజం నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో, అందరూ ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోయారని.. అయితే తన నెక్ట్స్ మూవీ రాజకీయం నేపథ్యంలో కమర్షియల్ అంశాలతో కలిసి రాబోతుందని ఈ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.

Virata Parvam: విరాటపర్వం రివ్యూ ఇచ్చిన నిఖిల్.. ఎలా ఉందంటే?

ఇప్పటికే స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని, ఈ సినిమా కథ పూర్తవ్వగానే అఫీషియల్‌గా తానే అనౌన్స్ చేస్తానని వేణు చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్లు, నిర్మాతలు తదితర విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని వేణు ఊడుగుల తెలిపారు. ఏదేమైనా నక్సలిజం నుండి రాజకీయం వైపు మారుతున్న ఈ యంగ్ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమాతోనైనా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని పలువురు కోరుతున్నారు.