Hindu Refugees: తొలిసారిగా గుజరాత్ ఎన్నికల్లో ఓటు వేయనున్న పాక్ శరణార్థులు

పాకిస్తాన్ నుంచి ఇండియా వలస వచ్చిన పౌరులు రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరికి ఇటీవలే భారత ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది.

Hindu Refugees: తొలిసారిగా గుజరాత్ ఎన్నికల్లో ఓటు వేయనున్న పాక్ శరణార్థులు

Hindu Refugees: పాకిస్తాన్ నుంచి ఇండియా వలస వచ్చిన శరణార్థులు త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 500 మందికిపైగా పౌరులు కొన్నేళ్ల క్రింద పాకిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చారు. వారిలో అధిక శాతం హిందువులే ఉన్నారు.

Measles Cases: ముంబైలో విజృంభిస్తున్న మీజిల్స్ వ్యాధి.. నెల రోజుల్లో 13 మంది మృతి

వీరికి పాక్ పౌరసత్వమే ఉండేది. ప్రస్తుతం ఇండియాలో శరణార్థులుగా ఉన్నారు. వీరిలో దాదాపు పాతికమందికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఇటీవల భారత పౌరసత్వం ఇచ్చారు. దేశ పౌరసత్వం రావడంతో వీరికి ఓటు హక్కు కూడా దక్కింది. దీంతో ఈ పాతిక మంది మొదటిసారిగా దేశంలోని, గుజరాత్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి దేశానికి వలస వచ్చిన పౌరులు ఇక్కడి రాజ్‌కోట్‌లో ఉంటున్నారు. వీరిలో చాలా మంది 16 ఏళ్ల క్రితం వలస వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అప్పటి నుంచి దేశ పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు.

పౌరసత్వం లభిస్తే ఆధార్ కార్డు, ఇతర దేశీయ డాక్యుమెంట్లు కూడా మంజూరు అవుతాయి. ప్రస్తుతం వలస వచ్చిన వాళ్లంతా అద్దె ఇండ్లలో ఉంటూ వివిధ సంస్థల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన మైనారిటీలకు దేశ పౌరసత్వం ఇవ్వాలని కొంతకాలం క్రితం కేంద్రం చట్టం చేసిన సంగతి తెలిసిందే.