KV Anand : ప్రముఖ దర్శకుడు కె.వి. ఆనంద్ ఇకలేరు..

ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్‌ (54) ఇకలేరు.. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు గుండెపోటుతో ఆయన క‌న్నుమూశారు..

KV Anand : ప్రముఖ దర్శకుడు కె.వి. ఆనంద్ ఇకలేరు..

Veteran Tamil Director Cinematographer Kv Anand Passes Away

KV Anand: ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్‌ (54) ఇకలేరు.. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు గుండెపోటుతో ఆయన క‌న్నుమూశారు.
చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి. ఆనంద్, ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్‌ స్టార్ట్ చేశారు. క‌ల్కి, ఇండియా టుడే దిన ప‌త్రిక‌ల్లో ప‌నిచేశారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి. శ్రీరామ్‌ దగ్గర అసిస్టెంట్‌గా అనుభవం సంపాదించి కెమెరామెన్ అయ్యారు..

మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘తెన్మావిన్ కొంబత్’ (Thenmavin Kombath) తో కెమెరామెన్‌గా పరిచయమయ్యారు.. బెస్ట్ సినిమాటోగ్రాఫీ కేటగిరీలో ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తర్వాత మోహన్ లాల్ ‘మిన్నారం’ (Minnaram) సినిమా కూడా పనిచేశారు.. ‘ప్రేమ‌దేశం’, ‘ఒకేఒక్క‌డు’, సూపర్‌స్టార్ ర‌జినీకాంత్ ‘శివాజీ’ సినిమాలతో పాటు తెలుగులో మోహన్ బాబు నటించిన ‘పుణ్యభూమి నాదేశం’ సినిమాలకు కె.వి. ఆనంద్ తన సినిమాటోగ్రఫీతో వన్నె తీసుకొచ్చారు..

శ్రీకాంత్, గోపిక, పృథ్విరాజ్ నటించిన ‘క‌ణా కండేన్’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. సూర్య‌తో ‘వీడొక్క‌డే’ (అయాన్‌) తో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.. జీవాతో తెర‌కెక్కించిన రంగం (కో) సినిమాతో అటు తమిళంతో పాటు తెలుగులోనూ సూప‌ర్ హిట్ కొట్టారు.. త‌ర్వాత బ్ర‌ద‌ర్స్‌ (మాట్రాన్‌), ధనుష్‌తో అనేకుడు (అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాల‌ను తెర‌కెక్కించారు. కె.వి.ఆనంద్ మృతిపై చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.