T.Congress : టి.కాంగ్రెస్ నేతలను పిలవాలి.. సోనియాకు వీహెచ్ విజ్ఞప్తి

ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే రాష్ట్ర నాయకులను పిలిచి సోనియా మాట్లాడాలని, తనకు సోనియాగాంధీ నుంచి పిలుపు రాలేదని, తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి తప్పేం లేదని...

T.Congress : టి.కాంగ్రెస్ నేతలను పిలవాలి.. సోనియాకు వీహెచ్ విజ్ఞప్తి

Soniya

VH Hanumantha Rao : తెలంగాణ కాంగ్రెస్ నేతలను పిలిచి మాట్లాడాలని, వారి అభిప్రాయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పార్టీ సీనియర్ నేత వీహెచ్. పిలుస్తుందని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఒక్కడినే కాకుండా అందరినీ పిలవాలన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య అంతర్గత విబేధాలు పొడచూపుతున్న సంగతి తెలిసిందే. టి. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

Read More : Telangana TPCC : మాణిక్యం ఠాగూర్ తెలంగాణకు అన్యాయం చేయకు – వీహెచ్

అందులో జగ్గారెడ్డి కూడా విమర్శలు చేస్తుండడంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో.. అన్నీ బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తప్పించింది టీపీసీసీ. ఈ క్రమంలో.. 2022, మార్చి 25వ తేదీ శుక్రవారం మీడియాతో వీహెచ్ మాట్లాడారు. ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే రాష్ట్ర నాయకులను పిలిచి సోనియా మాట్లాడాలని, తనకు సోనియాగాంధీ నుంచి పిలుపు రాలేదని, తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి తప్పేం లేదని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో ఆయన్నే మొదట ఏదో అన్నారు..దీంతో భావోద్వేగంతో జగ్గారెడ్డి మాట్లాడారని వివరించారు.

Read More : VH : ప్రతిపక్షాలపై మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ బలోపేతంపై సోనియా దృష్టి సారించారని చెప్పిన వీహెచ్… నేతలందరితో మాట్లాడుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతంపై తీసుకుంటున్న చర్యలపై సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత మొదలైందని జోస్యం చెప్పారు. బీజేపీని మించి కార్యక్రమాలు తెలంగాణలో కాంగ్రెస్ చేయాలని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ సమయంలో ఏవిధంగా పార్టీ ఉందో అదే తరహాలో సోనియా గాంధీ సమయంలో కాంగ్రెస్ ఉండాలని వీహెచ్ ఆకాంక్షించారు.