Agnipath: నేడు దేశంలో ‘అగ్నిపథ్‌’ అగ్ని గుండంలా మారింది: వీహెచ్‌

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... సైనికుల నియమకాల్లో అగ్నిపథ్‌ పేరుతో 4 ఏళ్ళు మాత్ర‌మే సర్వీస్ తీసుకురావ‌డం దారుణమ‌ని ఆయ‌న చెప్పారు.

Agnipath: నేడు దేశంలో ‘అగ్నిపథ్‌’ అగ్ని గుండంలా మారింది: వీహెచ్‌

Vh

Agnipath: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… సైనికుల నియమకాల్లో అగ్నిపథ్‌ పేరుతో 4 ఏళ్ళు మాత్ర‌మే సర్వీస్ తీసుకురావ‌డం దారుణమ‌ని ఆయ‌న చెప్పారు. నాలుగేళ్ళ‌ తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదని అన్నారు. గతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారని ఆయ‌న తెలిపారు.

Agnipath: ‘అగ్నిప‌థ్’ బంగారంలాంటి ఛాన్స్‌.. కొన్నిరోజుల్లో నియామ‌క ప్ర‌క్రియ షురూ: రాజ్‌నాథ్‌

సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమ‌ని వీహెచ్ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడ్డ వారికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన నిల‌దీశారు. ర‌క్ష‌ణ శాఖ దగ్గర నిధులు లేవంటే ప్రపంచం ముందు దేశం పరువు ఏం కావాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను బీజేపీ మానుకోవాలని ఆయ‌న అన్నారు. నేడు దేశంలో అగ్నిపథ్‌ అగ్ని గుండంలా మారిందని ఆయ‌న మండిప‌డ్డారు.

Agnipath: యువతకు ఎంతో ప్రయోజనం: అగ్నిప‌థ్‌పై అమిత్ షా ప్ర‌శంస‌లు

మహమ్మద్ ప్రవక్త పైన బీజేపీ నాయకులు ఇటీవ‌ల‌ చేసిన వ్యాఖ్య‌ల‌తో ప్రపంచం ముందు భారత్ పరువు పోయిందని, ఇప్పుడు అగ్నిప‌థ్ వ‌ల్ల క‌ల‌క‌లం చెల‌రేగుతోందని చెప్పారు. ఇవన్నీ దేశ ప్రతిష్ఠ‌ను మంట గలుపుతున్నాయని ఆయ‌న అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల చొప్పున‌ ఇస్తామని మోసం చేసిన ప్ర‌ధాని మోదీకి పాలించే నైతిక హక్కు లేదని వీహెచ్ విమ‌ర్శించారు.