Kerala: ఎంత అహంకారం.. కారుకు ఒరిగినందుకు బాలుడిని తన్నిన యజమాని.. వీడియో వైరల్

తన కారుకు ఒరిగి నిల్చున్నాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని తన్నాడు కారు యజమాని. చిన్నారి బాలుడు అని కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.

Kerala: ఎంత అహంకారం.. కారుకు ఒరిగినందుకు బాలుడిని తన్నిన యజమాని.. వీడియో వైరల్

Kerala: కేరళలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తన కారుకు ఒరిగి నిలబడ్డందుకు ఒక బాలుడిని కాలితో తన్నాడు ఒక వ్యక్తి. ఈ ఘటన ఇటీవల కన్నూర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Karnataka: గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది.. ఇంట్లోనే ప్రసవించి ప్రాణాలు వదిలిన మహిళ.. అప్పుడే పుట్టిన కవలలూ మృతి

ఈ ఘటనపై ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. కన్నూర్ జిల్లాలో రద్దీగా ఉండే ఒక రోడ్డు పక్కన ఒక వ్యక్తి కారు ఆపాడు. అప్పుడే ఒక ఆరేళ్ల బాలుడు అక్కడికి వచ్చి, కారు వెనుక వైపు ఒరిగి నిల్చున్నాడు. దీంతో కోపం తెచ్చుకున్న కారు ఓనర్… తన డ్రైవింగ్ సీటులోంచి బయటికి వచ్చి, బాలుడిని గట్టిగా తన్నాడు. దీంతో దెబ్బతగిలి, భయపడ్డ బాలుడు అక్కడ్నుంచి పక్కకు జరిగాడు. భయంభయంగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను అక్కడి వారెవరో వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేరళ ప్రతిపక్షమైన బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఇలాంటి ఘటనల ద్వారా దేవుడి భూమిగా చెప్పుకునే కేరళ.. దెయ్యాల భూమిగా మారుతోందని బీజేపీ విమర్శించింది.

Sir Movie: ధనుష్ ‘సార్’ మనసు మార్చుకున్నాడా.. మళ్లీ అదే బాటలో..?

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు నెటిజన్ల నుంచి కూడా దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కేరళ స్పీకర్, విద్యా శాఖ మంత్రితోపాటు ప్రభుత్వం స్పందించింది. ఘటనలో నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని పొన్యంపాలానికి చెందిన షిహ్సద్‌గా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలుడిని రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వాడిగా గుర్తించారు.