Pushpa: పుష్ప పాటకు లేటుగా స్టెప్పులేసిన విద్యా బాలన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్....

Pushpa: పుష్ప పాటకు లేటుగా స్టెప్పులేసిన విద్యా బాలన్

Vidya Balan Grooves For Srivalli Song From Pushpa

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు చిత్ర యూనిట్. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసింది. ఇక అక్కడ కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించాడు.

Srivalli Song : పుష్ప , శ్రీవల్లీలని అచ్చు దింపేసిన బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, హీరోయిన్

ఇక ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లి’ పాటకు జనం ఫిదా అయిపోయారు. ఈ పాటలో బన్నీ ఎక్స్‌ప్రెషన్స్, ఆయన వేసిన ఐకానిక్ స్టెప్పు నెట్టింట ఎంత వైరల్‌గా మారాయో మనందరికీ తెలిసిందే. ఇక పుష్ప స్టెప్పును ఇమిటేట్ చేస్తూ ఎంతో మంది సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ హంగామా చేస్తూ వచ్చారు. అయితే ఇంకా పుష్ప పాటల మాయాజాలం ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్. అందరికంటే కాస్త ఆలస్యమైనప్పటికీ తనదైన స్టయిల్‌లో శ్రీవల్లి పాటకు స్టెప్పులు వేసింది ఈ హీరోయిన్.

Pushpa : ముంబై పోలీసుల మ్యూజిక్ బ్యాండ్.. ‘పుష్ప’ శ్రీవల్లి సాంగ్ రీక్రియేషన్

ప్రస్తుతం విద్యా బాలన్ వేసిన శ్రీవల్లి స్టెప్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆమె అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ పుష్ప చిత్రం క్రేజ్‌ను మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప పార్ట్ 2 కూడా త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.