Salaar: సలార్ సినిమాలో క్రేజీ స్టార్.. నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. సలార్ సినిమాలో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని.. సలార్ రెండో పార్ట్‌లో ఈ హీరో పాత్ర అదిరిపోయేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దుతున్నాడని ఓ వార్త వినిపిస్తోంది.

Salaar: సలార్ సినిమాలో క్రేజీ స్టార్.. నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలే!

Vijay Devarakonda A Part Of Prabhas Salaar Movie

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Salaar: ‘సలార్’పై పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మామూలుగా లేదట!

అయితే ఈ సినిమాకు సంబంధించి నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రేక్షకులను అవాక్కయ్యే వార్త ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సలార్ సినిమాలో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని.. సలార్ రెండో పార్ట్‌లో ఈ హీరో పాత్ర అదిరిపోయేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దుతున్నాడని ఓ వార్త వినిపిస్తోంది. దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ నయా లుక్ కూడా ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తోంది.

Salaar: రాధేశ్యామ్, సాహోలో లేనిది ‘సలార్’లో చూపిస్తున్న ప్రభాస్!

సలార్ కోసం ప్రభాస్ రఫ్ లుక్‌లో కనిపించగా, ఇప్పుడు టాలీవుడ్ రౌడీ స్టార్ కూడా దాదాపు ఇదే తరహా లుక్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఆయన సలార్ సినిమాలో జాయిన్ అవుతున్నాడని, ఈ సినిమా క్లైమాక్స్‌లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉంటుందని.. అది సలార్ రెండో భాగంలో కీలక పాత్రగా మారుతుందనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇక విజయ్ దేవరకొండను ప్రభాస్ తమ్ముడిగా సలార్‌లో మనకు చూపించబోతున్నారట. అయితే ఈ వార్తకు సంబంధించి చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. మరి ఈ వార్తలో ఎలాంటి నిజం ఉందో తెలియాలంటే ఏదైనా అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.