Vijay Devarakonda: ఖుషి కోసం విజయ్ మాస్టర్ ప్లాన్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన కంటిన్యూగా డేట్లు కేటాయించి, ఈ సినిమాను నవంబర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నాడట.

Vijay Devarakonda: ఖుషి కోసం విజయ్ మాస్టర్ ప్లాన్..!

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇప్పటికే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన ఈ హీరో, ఆ తరువాత మరోసారి పూరీతో కలిసి జనగణమన అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలతో పాటు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు ఈ రౌడీ స్టార్.

Vijay Devarakonda: ముగ్గురితో సై అంటోన్న రౌడీ!

ఈ చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, శరవేగంగా షూటింగ్ ముగించేయాలని చూస్తోంది. అయితే ఇన్ని సినిమాలు చేస్తున్నా, విజయ్ దేవరకొండ మాత్రం ఖుషి మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన కంటిన్యూగా డేట్లు కేటాయించి, ఈ సినిమాను నవంబర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్‌గా నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య రొమాన్స్‌ను దర్శకుడు ఏ విధంగా తెరకెక్కిస్తాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Vijay Devarakonda : కరణ్ జోహార్‌కి తనేంటో చూపించడానికే రౌడీ హీరో అలా చేశాడా??

ఇక ఈ సినిమాతో పాటు పూరీతో కలిసి జనగణమన సినిమాను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు. ఏదేమైనా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపులు తనవైపుకు తిప్పుకున్న ఈ హీరో లైగర్, జనగణమన, ఖుషి సినిమాల కోసం తనదైన మాస్టర్ ప్లాన్‌తో ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఈ సినిమాలతో మనోడు ఎలాంటి విజయాలను అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.