Samantha: సమంత బర్త్‌డే.. సినిమా షూటింగ్‌లో స్పెషల్ సర్‌ప్రైజ్

స్టార్ హీరోయిన్ సమంత బర్త్‌డే సందర్భంగా స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. గురువారం సమంత పుట్టిన రోజు. పుట్టిన రోజున సమంత.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్‌లో భాగంగా కాశ్మీర్‌లో ఉంది.

Samantha: సమంత బర్త్‌డే.. సినిమా షూటింగ్‌లో స్పెషల్ సర్‌ప్రైజ్

Samantha Ruth Prabhu

samantha: స్టార్ హీరోయిన్ సమంత బర్త్‌డే సందర్భంగా స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. గురువారం సమంత పుట్టిన రోజు. పుట్టిన రోజున సమంత.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్‌లో భాగంగా కాశ్మీర్‌లో ఉంది. బుధవారం రాత్రిపూట ఈ షూటింగ్ జరిగింది. ఈ పుట్టిన రోజున సమంతకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని చిత్ర యూనిట్ డిసైడైంది. దీనికోసం సమంతకు తెలియకుండా ఒక ఫేక్ సీన్ రాసి, రిహార్సల్స్ కూడా చేయించారు. తర్వాత షూటింగ్‌లో భాగంగా సమంత, విజయ్ దేవర కొండతో ఆ ఫేక్ సీన్‌లో నటిస్తుంది. అయితే, దానికి విజయ్ స్పందిస్తూ సమంతా అంటాడు.

Samantha : నా దయాగుణాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దు.. సమంత సీరియస్ పోస్ట్..

దీంతో సీన్‌లోంచి బయటికొచ్చి సొంత పేరుతో పిలవడంతో సమంత ఆశ్చర్యపోతుంది. ఆ వెంటనే హ్యాపీ బర్త్‌డే అంటూ విష్ చేశాడు విజయ్. ఆ సీన్‌లో తనకు బర్త్‌డే విషెస్ చెప్పాడని ఆశ్చర్యపోయేలోపే, చిత్ర యూనిట్ అంతా హ్యాపీ బర్త్‌డే అంటూ విష్ చేశారు. దీంతో సామ్ మరింత సంతోషానికి గురైంది. అప్పుడు ఇదంతా తనకు బర్త్‌డే విషెస్ చేసేందుకు చిత్ర యూనిట్ స్పెషల్ ప్లాన్‌గా అర్థం చేసుకుంది. తర్వాత దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ దేవర కొండ, వెన్నెల కిషోర్, యూనిట్ అంతా కలిసి సమంతతో కేక్ కట్ చేయించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.