విజయ్ వీరాభిమాని.. థియేటర్ మొత్తం బుక్ చేసేసింది..

విజయ్ వీరాభిమాని.. థియేటర్ మొత్తం బుక్ చేసేసింది..

Vijay Fan: తమిళనాట ‘దళపతి’ విజయ్‌కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అతని సినిమా రిలీజ్ రోజు అభిమానులు చేసే హంగామా గురించి మాటల్లో చెప్పడం కష్టం. విదేశాల్లో సైతం అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా విజయ్ వీరాభిమాని చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

MASTER

‘దళపతి’ విజయ్ కథానాయకుడిగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా.. మాళవికా మోహనన్ కథానాయికగా నటించిన కోలీవుడ్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’.. ‘ఖైది’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న తమిళ్, తెలుగులో భారీగా విడుదలైంది. ఇతర దేశాల్లోనూ థియేటర్లలో విడుదలైంది.

MASTER

కాగా లాక్‌డౌన్ కారణంగా మలేషియాలో ‘మాస్టర్’ రిలీజ్ కాలేదు. దీంతో ఎలాగైనా సినిమా చూడాలని ఆష్లినా అనే విజయ్ వీరాభిమాని మలేషియా నుండి చెన్నై వచ్చింది. స్థానిక సత్యం సినిమాస్‌ (కాంప్లెక్స్) లో ఏకంగా ఓ థియేటర్ మొత్తం బుక్ చేసేసింది. బుధ‌వారం రోజు ఓ షో కి చెందిన టికెట్స్ అన్నీ తానే కొనేసింది. ఎంచక్కా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ‘మాస్టర్’ మూవీ చూసి భలే హ్యాపీగా ఫీలయ్యింది. విజయ్ పట్ల ఈ మలేషియా అమ్మాయికి ఉన్న అభిమానం చూసి మిగతా విజయ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఔరా అంటున్నారు.

MASTER