Vijay Sethupathi : రోజా భర్తకి కోటి రూపాయలు ఇచ్చిన విజయ్ సేతుపతి..

ప్రస్తుత తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అటు హీరోగానూ, ఇటు విలన్ గాను, అప్పుడప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ తోను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Vijay Sethupathi : రోజా భర్తకి కోటి రూపాయలు ఇచ్చిన విజయ్ సేతుపతి..

Vijay

Vijay Sethupathi :  ప్రస్తుత తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అటు హీరోగానూ, ఇటు విలన్ గాను, అప్పుడప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ తోను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయకపోయినా తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా దగ్గరయ్యాడు. తెలుగులో కూడా విజయ్ కి అభిమానులు ఉన్నారు. ఇటీవల ఉప్పెన సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు.

Neha Dhupiya : మగబిడ్డకు జన్మనిచ్చిన బాలకృష్ణ హీరోయిన్

ఒక పక్క యాక్టర్ గా సంపాదిస్తూనే అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. కష్ట సమయాల్లో అవసరం వచ్చినప్పుడు విరాళాలు కూడా ఇస్తున్నాడు. తాజాగా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (fefsi) నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరు అయ్యాడు విజయ్ సేతుపతి. రోజా భర్త ఆర్కే సెల్వమణి ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో fefsi అధినేత ఆర్కే సెల్వ మణికి విజయ్ సేతుపతి కోటి రూపాయల చెక్ ను అందించాడు. ఈ కోటి రూపాయలని సాంకేతిక నిపుణుల కోసం కట్టే రెసిడెన్షియల్ కాలనీల కోసం వాడమని విజయ్ తెలిపినట్టు సమాచారం. ఈ కార్యక్రమం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ సేతుపతి చేసిన ఈ మంచి పనికి ఇండస్ట్రీ కార్మికులు, అభిమానులు అభినందిస్తున్నారు.