Vijay Sethupathi : ఇండస్ట్రీకి కొత్త విలన్.. హీరో క్యారెక్టర్స్ ని డామినేట్ చేస్తున్న విలన్..

కోలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు ఆల్ ఇండియా క్రేజీ విలన్ అయ్యాడా అంటే అవుననే అంటున్నారు సినీ పరిశ్రమ వర్గాలు. ఇప్పటికే సౌత్ ఇండియాలో క్రేజీ విలన్ గా మారిపోయిన విజయ్ సేతుపతి లేటెస్ట్ గా బాలీవుడ్ లో........

Vijay Sethupathi : ఇండస్ట్రీకి కొత్త విలన్.. హీరో క్యారెక్టర్స్ ని డామినేట్ చేస్తున్న విలన్..

Vijay Sethupathi

Vijay Sethupathi :  కోలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు ఆల్ ఇండియా క్రేజీ విలన్ అయ్యాడా అంటే అవుననే అంటున్నారు సినీ పరిశ్రమ వర్గాలు. ఇప్పటికే సౌత్ ఇండియాలో క్రేజీ విలన్ గా మారిపోయిన విజయ్ సేతుపతి లేటెస్ట్ గా బాలీవుడ్ లో తన విలనీ విశ్వరూపం చూపించనున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. తమిళ తంబిలు మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే విజయ్ సేతుపతి ఇప్పుడు ఆల్ ఇండియా క్రేజీ విలన్ అయిపోయాడు. అన్ని భాషల్లో పరిచయంతో స్టార్ డైరెక్టర్స్, స్టార్స్ కు విలన్ గా ఫస్ట్ ఛాయిస్ అవుతున్నాడు. పుష్ప 2లో పుష్ప రాజు రూలింగ్ కి బ్రేక్ లేసే పోలీస్ అధికారిగా యాంటగనెస్ట్ క్యారెక్టర్ ఉంటుందనే వార్త వచ్చిన కొన్ని రోజులకే ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాలో విలన్ మక్కల్ సెల్వనే అనే న్యూస్ వైరలవుతోంది.

తమిళ్ లో విజయ్ సేతుపతి కెరీర్ బిగినింగ్ డేస్ లోనే సుందర పాండియన్ సినిమాకు 2012లో తమిళనాడు స్టేట్ బెస్ట్ విలన్ అవార్డ్ అందుకున్న మక్కల్ సెల్వన్, విక్రమ్ వేదా సినిమాకు మరోసారి బెస్ట్ విలన్ అవార్డ్ అందుకున్నారు. పేట సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ధీటుగా నటించి మెప్పించాడు విజయ్ సేతుపతి. పేట బాలీవుడ్ లోనూ హిట్ కావడంతో అక్కడి ఆడియన్స్ కీ దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు జవాన్ సినిమాలో షారూక్ ఖాన్ తో పోటీ పడేందుకు రెడీ అవుతున్నాడనే చర్చ బాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.

Samantha : ముగ్గురు ముగ్గురే.. బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన హీరోయిన్స్..

తెలుగులో సైరా నరసింహా రెడ్డితో ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో విలనీ విశ్వరూపం చూపించేశాడు. ఇటీవల కమల్ విక్రమ్ సినిమాలో కూడా విజయ్ సేతుపతి అదరగొట్టాడు. దాంతో పుష్ప రాజ్ కి సమ ఉజ్జీగా విజయ్ సేతుపతిని ఫిక్స్ చేశాడు సుకుమార్. కన్నడలోనూ అఖాడ సినిమాతో విలన్ క్యారెక్టర్ తోనే ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు మక్కల్ సెల్వన్. ఇలా సౌత్ ఇండియాలో ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు హీరోలని డామినేట్ చేసే విలన్ గా కనిపిస్తున్నాడు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడని తెలిసిందే. అందుకే డైరెక్టర్లు ఏరికోరి విజయ్ సేతుపతిని విలన్ గా తెచ్చుకుంటున్నారు.