Vijay Sethupathi : నా మాస్ ఏంటో తెలియదు అంటున్న మక్కల్ సెల్వన్.. ‘ఆహా’ లో ‘విజయ్ సేతుపతి’..

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేసిన కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ‘ఆహా’..

Vijay Sethupathi : నా మాస్ ఏంటో తెలియదు అంటున్న మక్కల్ సెల్వన్.. ‘ఆహా’ లో ‘విజయ్ సేతుపతి’..

Vijay Sethupathi Telugu Movie Trailer

Vijay Sethupathi : 2021న ‘ఆహా’లో విడుద‌లై ఒరిజిన‌ల్స్‌, వెబ్ సిరీస్‌లైన‌ ‘క్రాక్‌’, ‘నాంది’, ‘గాలి సంప‌త్‌’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌’, ‘మెయిల్‌’, ‘సుల్తాన్’ వంటి ఫిల్మ్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ‘ఆహా’..

Sangathamizhan

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేసిన కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ‘ఆహా’.. రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌.. ఈ చిత్రాన్ని విజయ్ చందర్ దర్శకత్వంలో బి.భారతి రెడ్డి నిర్మించారు. తమిళ్‌లో మంచి విజయం సాధించిందీ చిత్రం..

Sangathamizhan

రీసెంట్‌గా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. రాజకీయ పలుకుబడితో, వారి స్వార్థం కోసం రైతులను అణగదొక్కడం, రైతు సమస్యలు చూసి వారి తరపున పోరాడే నాయకుడిగా హీరో కనిపించబోతున్నాడనేది ట్రైలర్‌లో చూపించండంతో పాటు, విజయ్ సేతుపతి రెండు క్యారెక్టర్లకి లింక్ ఏంటనే సస్పెన్స్ క్రియేట్ చేశారు.

Play Back : ‘ఆహా’లో మే 21 నుంచి ఎంగేజింగ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ప్లే బ్యాక్’..!

నాజర్, శ్రీమాన్, సూరి, జాన్ విజయ్, అశుతోష్ రాణా, రవి కిషన్ తదితరులు నటించిన ‘విజయ్ సేతుపతి’ మే 14 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకి కెమెరా : ఆర్.వేల్‌రాజ్, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, సంగీతం : వివేక్ – మెర్విన్, రచన, దర్శకత్వం : విజయ్ చందర్.