చంద్రబాబు.. మీరు రాయలసీమ బిడ్డేనా, అసలే ఏపీవారేనా?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 06:08 AM IST
చంద్రబాబు.. మీరు రాయలసీమ బిడ్డేనా, అసలే ఏపీవారేనా?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలించే జీవో 203పై అభిప్రాయం చెప్పాలని విజయసాయిరెడ్డి నిలదీశారు. అడ్డమైన విషయాలపై జూమ్‌లో మాట్లాడే చంద్రబాబుకు… ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా ? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అసలు మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

 

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 203 జీవో వివాదానికి దారితీసింది. ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు రాజేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డ్ కు లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి 3 టీఎంసీల నీటి తరలించేందుకు ప్రయత్నిస్తోందని, దీని కోసమే 203 జీవో జారీ చేసిందని లేఖలో తెలిపింది. ఈ జీవోపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

శ్రీశైలం నుండి కొత్త లిఫ్ట్ స్కిమ్ ను ఏర్పాటు చేయడం అన్యాయని, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన అడ్మినిస్ట్రేషన్ జీవో అక్రమమని తెలంగాణ ప్రభుత్వం లేఖలో తెలిపింది. కేఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే ఏ ప్రాజెక్ట్ అయినా మొదలు పెట్టాలని, దీనిపై కృష్ణా నది యాజమాన్య బోర్డ్ వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. టెండర్ల ప్రక్రియ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంది.

Read Here>> హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు రావొచ్చు..!