Vijayashanthi : ఆమిర్ ఖాన్‌ ‘లాల్ సింగ్ చడ్డా’పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

తాజాగా 'లాల్ సింగ్ చడ్డా' సినిమాపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై పలు ట్వీట్స్ చేసింది విజయశాంతి. ఈ ట్వీట్స్ లో.. ''ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో.......

Vijayashanthi : ఆమిర్ ఖాన్‌ ‘లాల్ సింగ్ చడ్డా’పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Aamir Khan :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌, కరీనా కపూర్‌, నాగ చైతన్య మెయిన్ లీడ్స్ లో ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాని తెరకెక్కించారు. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది ఈ సినిమా. నాగ చైతన్య ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి బాయ్‌కాట్‌ సెగ తగిలింది. ‘లాల్ ‍సింగ్‌ చడ్డా’ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం చేశారు. దీంతో ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ బాయ్‌కాట్‌ లాల్ సింగ్ చడ్డా ట్రెండింగ్ లో ఉంది. గతంలో అమీర్ ఖాన్ ఇండియాలో ఉండాలంటే రక్షణ లేదు, ఇక్కడ బతకాలంటే భయం వేస్తుంది అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా అమీర్ ని వ్యతిరేకించారు. ఇప్పుడు మరోసారి అమీర్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఇక్కడ రక్షణ లేదు అనేవాడివి ఇక్కడ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నావు? పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ వెళ్ళు అని కామెంట్స్ చేస్తూ లాల్ సింగ్ చడ్డాని బాయ్‌కాట్‌ చేయమని ట్రెండింగ్ చేస్తున్నారు.

తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై పలు ట్వీట్స్ చేసింది విజయశాంతి. ఈ ట్వీట్స్ లో.. ”ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నారు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని, ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమీర్ అన్నారు.

భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో, ఇప్పటికీ పొందుతున్నారో, చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మనకి స్వాతంత్ర్యం రావడానికి ముందు, తర్వాత, నేడు ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ఆమీర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. కానీ వాస్తవమేంటో తెలిసిన ప్రజలు ఆమీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారు.

Aamir Khan : నా సినిమాని బాయ్‌కాట్‌ చేయకండి.. ప్లీజ్..

గతంలో ఆమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయి. ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ అనే ఇన్స్‌పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు. కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని ఆమీర్ గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నరు.

దురదృష్టమేంటంటే జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు ఆమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీ షోల్లో పాల్గొంటున్నరు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి” అని సీరియస్ గా పోస్ట్ చేశారు. దీంతి విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి.