‘విక్రాంత్ రోనా’ గా ‘కిచ్చా’ సుదీప్.. బుర్జ్‌ ఖలీఫాలో సరికొత్త రికార్డ్..

‘విక్రాంత్ రోనా’ గా ‘కిచ్చా’ సుదీప్.. బుర్జ్‌ ఖలీఫాలో సరికొత్త రికార్డ్..

Vikrant Rona: శాండల్‌వుడ్‌ బాద్‌షా, అభినయ చక్రవర్తి, కిచ్చా సుదీప్ నటుడిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘విక్రాంత్ రోనా’‌ (ది వరల్డ్ ఆఫ్ ఫాంటమ్) టైటిల్‌ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో విడుదల చేశారు.

Vikrant Rona

కరోనా విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ చేయడానికి ఎవ‌రు భ‌య‌ప‌డ్డా తానేం త‌గ్గేది లేదు అంటూ భారీ బడ్జెట్‌ మూవీ ‘విక్రాంత్ రోనా’‌ షూటింగ్ జరిపి అందర్నీ ఆశ్చర్యపరిచారు సుదీప్.

Vikrant Rona

ఇక దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో ‘విక్రాంత్ రోనా’‌ టైటిల్‌ లోగో, స్నీక్‌ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త ఆధ్యాయానికి కిచ్చా సుదీప్‌ శ్రీకారం చుట్టారు. ఈ వేడుక కోసం సుదీప్‌ 2000 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ ఎత్తున్న కటౌట్‌తో సూపర్‌స్టార్‌ సుదీప్‌ ఓ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు.

Vikrant Rona

స్నీక్ పీక్ ఆకట్టుకుంటోంది. నీతా అశోక్ కథానాయికగా నటిస్తున్న ‘విక్రాంత్ రోనా’‌ చిత్రాన్ని షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్ నిర్మిస్తుండగా.. అనూప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలతో సహా ఐదు విదేశీ భాషల్లో.. 50 దేశాల్లో ‘విక్రాంత్ రోనా’‌ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నారు.

Vikrant Rona